ఎయిర్ ఏషియా-టాటా జాయింట్ వెంచర్‌కి ఎఫ్‌ఐపీబీ నుండి అనుమతి

ఇటీవలే విమాన సర్వీసుల నిర్వహణకు గాను ఎయిర్ ఏషియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారతదేశంలో కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించింది. ప్రైవేటు రంగ కంపెనీగా ఐదు లక్షల కోట్ల రూపాయల అథీకృత మూలధనంతో 2013 మార్చి 28న జేవీ ఏర్పాటు జరిగిందని, ముంబై రిజిస్టర్డ్ ఆఫీసుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీన్ని కొన్నాళ్ల తర్వాత మార్చుకునే అవకాశం ఉంది. ఎయిర్‌లైన్ లోగో, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇతరత్రా పత్రాలను మార్చి 11న కంపెనీ దాఖలు చేసింది.
రూ. 80 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ జేవీలో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ఈ ఎయిర్‌లైన్స్ తక్కువ చార్జీల విధానాన్నే కస్టమర్స్‌కు అందిస్తుంది.
మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. భారత్‌లో ఎయిర్‌ఏషియా జెట్ ఎయిర్‌వేస్, స్పయిస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్‌తో పాటు ఎయిర్ ఇండియాతో పోటీపడతాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications