స్విట్జర్లాండ్ కంపెనీ, నోవార్టిస్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఇక వివరాల్లోకి వెళితే 2006లో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే గ్లివెక్ ఔషధంలో కొత్తగా మార్పులు చేశామని, కొత్తగా పేటెంట్ హక్కులివ్వాలని భారత పేటెంట్ కార్యాలయాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ కంపెనీ కోరింది. అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే తమ ఔషధం, గ్లివిక్‌కు భారత్‌లో పేటెంట్ ఇవ్వాలని, దీనికి జనరిక్ ఔషధాలు తయారు చేయకుండా భారత ఫార్మా కంపెనీలను నిరోధించాలని కోరుతూ స్విట్జర్లాండ్ కంపెనీ, నోవార్టిస్ కోరుతుంది. భారత పేటెంట్ చట్టం, సెక్షన్ 3(డీ), సెక్షన్ 3(బి)లను ప్రస్తావిస్తూ ద కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ అండ్ డిజైన్ సంస్థ నోవార్టిస్ విన్నపాన్ని తోసిపుచ్చింది. సెక్షన్ 3(డి) ప్రకారం ఇంతకు ముందే వాడుకలో ఉన్న ఔషధాల పనితీరు మరింత మెరుగైనవి అయితే తప్ప పేటెంట్ ఇవ్వరు.
ఇక సెక్షన్ 3(బి) ప్రకారం ప్రస్తుతమున్న ఔషధాల కంటే మెరుగైన పనితీరు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త ఔషధాల్లో లేనప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఔషధానికి పేటెంట్‌ను నిరాకరించవచ్చు. ఈ రెండు సెక్షన్లను ఉటంకిస్తూ పేటెంట్ విభాగం నోవార్టిస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ చెన్నై కేంద్రంగా పనిచేసే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డ్(ఐపీఏబీ)ను నోవార్టిస్ సంప్రదించింది. అక్కడ కూడా చుక్కెదురవడంతో ఈ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 4 వరకూ విచారణ జరిపిన జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, రంజన్ ప్రకాష్ దేశాయ్‌లు సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పును వెల్లడించింది.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications