
దీంతో న్యాయమూర్తి యాక్సిస్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన రుణాన్ని ఎందుకు చెల్లించలేదన్న దానిపై డీసీహెచ్ఎల్ సరైన వివరణ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సరైన వివరణ ఇవ్వలేదని, అలాగే రుణానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించడంలో కూడా డీసీహెచ్‌ఎల్ విఫలమైందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అటాచ్‌మెంట్ కోరుతూ యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై కనీసం కౌంటర్ కూడా డీసీహెచ్‌ఎల్ దాఖలు చేయలేదని, ఈ నేపథ్యంలోనే ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు.
అటాచ్ చేసిన ఆస్తుల్లో వెంకట్‌రామిరెడ్డికి చెందిన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పెంటగాన్ ఎక్స్‌టెన్షన్‌లోని ఫ్లాట్ నెంబర్ 9 (ఇంటి నెంబర్ 8-2-703), ఇదే రోడ్డులోని 1050 గజాల ఇంటి స్థలం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లోని వినాయక్‌రెడ్డికి చెందిన 1570 గజాల ఇంటి స్థలం, డీసీహెచ్‌ఎల్ పేరుతో పటాన్‌చెరువు సమీపంలోని కొల్లూరులో ఉన్న ఏడు ఎకరాల భూమి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 1066 గజాల ఇంటి స్థలం ఉన్నాయి. డీసీహెచ్‌ఎల్ ఆస్తులను అటాచ్‌చేస్తూ డీఆర్‌టీ జారీచేసిన ఉత్తర్వులను ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్‌లకు యాక్సిస్ బ్యాంకు అందించనుంది.
ఇది ఇలా ఉంటే రుణ సంక్షోభంలో చిక్కుకున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) డిసెబంర్‌తో ముగిసిన మూడో త్త్రైమాసికంలో రూ. 2.21 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఒడిస్సీ రిటైల్ స్టోర్స్ కార్యకలాపాలను తగ్గించడంతో పాటు, ఐపీఎల్ ప్రాంచైజీని బీసీసీఐ రద్దు చేయడం లాంటి అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. గతయేడాది ఇదే క్యూ3లో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లాభం రూ. 21.33 కోట్లు. ఇది ఇలా ఉంటే డీసీహెచ్ఎల్ ఆదాయం ఏకంగా 58 శాతం క్షీణించడంతో పాటు రూ. 243.98 కోట్ల నుంచి రూ. 102.32 కోట్లకు తగ్గింది.
దీనితోపాటు డెక్కన్ క్రానికల్ హోల్టింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తనఖాలో ఉంచిన కొన్ని షేర్లను.. రుణాలిచ్చిన సంస్థలు స్వాధీనం చేసుకోవడంతో డిసెంబరు ఆఖరు నాటికి కంపెనీలో ప్రమోటర్ల వాటా 32.66 శాతానికి తగ్గిపోయింది. అదే సెప్టెంబర్‌లో 38.40 శాతంగా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్దకు అప్పు ఇచ్చిన రుణ దాతలు తమ సొమ్మును తిరిగి వెనక్కి తీసుకునే నిమిత్తం డెక్కన్ యాజమాన్యంపై పుల చోట్ల న్యాయస్దానాలు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లను ఆశ్రయించారు. రుణాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చలు జరుపుతున్నందున వడ్డీ బకాయిలు, ఇతర ఆర్థికపరమైన చెల్లింపులకు సంబంధించి ప్రొవిజనింగ్ చేయలేదని డీసీహెచ్‌ఎల్ పేర్కొంది.
ఇక ఐపీఎల్ జట్టును ఏకపక్షంగా రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై నష్టపరిహారాన్ని కోరుతూ బొంబే హైకోర్టును ఆశ్రయించామని, ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ వైస్ చైర్మన్ పి.కె. అయ్యర్ తెలిపారు. ఇటీవలే డెక్కన్ క్రానికల్‌కు చెందిన నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లైన ఎం సుకుమార్‌రెడ్డి, జీ కుమార్, వి సురేష్, పి సిద్దార్ద్‌లు బోర్డుకు రాజీనామాలను ఆమోదించినట్లు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీ) బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కి వెల్లడించింది. కాగా, డిసెంబర్ 8న సమావేశమైన బోర్డు వి లక్ష్మణాచార్య, మలపాక వెంకటేశ్వర్లు, ఎస్ సురేష్‌లను అదనపు డెరైక్టర్లుగా నియమించినట్లు వివరించింది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications