
ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీకి చెందిన 10 విమానాలతో పాటు, లీజుకు తీసుకున్న 15 విమానాలను మాత్రం డీరిజిస్టర్ చేయలేదని చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు పైగా రుణాలు, నష్టాల భారంతో ఉంది. తన సర్వీసులను పునరుద్దరించేలా కనబడటం లేదు. కింగ్‌ఫిషర్‌కు చెందిన దేశీయ ఫ్లయింగ్ స్లాట్‌లతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా స్లాట్‌లను రద్దు చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌కు కేటాయించిన స్లాట్‌లను రద్దు చేయడంతో.. ఈ స్లాట్‌లను వేరే విమానయాన కంపెనీలకు అందుబాటులో ఉంచాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆదేశించింది.
కింగ్‌ఫిషర్ దేశీయ, విదేశీ సర్వీసులను నిలిపేయడం, ఈ స్లాట్‌లను ఉపయోగించుకోకపోవడం వల్లే ఫ్లయింగ్ స్లాట్‌లను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని... ఇతర ఎయిర్‌లైన్స్‌కు వీటిని కేటాయించనున్నట్లు సమాచారం. సుమారుగా 8 దేశాలకు సంబంధించిన 126 అంతర్జాతీయ ఫ్లయింగ్ స్లాట్స్ కింగ్‌ఫిషర్‌కు ఉండేవి. వీటిని రద్దు చేయడం వల్ల ఇతర దేశీ ఎయిర్‌లైన్స్‌కు సుమారుగా వారానికి 25 వేల సీట్లు ఈ 8 దేశాల రూట్లలో అందుబాటులోకి రానున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సేవలను తిరిగి పునరుద్దణ చేసేందుకు తమకు అనుమతివ్వాలని ఆ కంపెనీ సీఈవో సంజయ్ అగర్వాల్ డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)ను కలిసి మరో సారి కోరినట్లు సమాచారం. ఐతే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ తమకు చెల్లించాల్సిన రూ. 390 కోట్ల పన్నులు చెల్లించాకే తిరిగి ఆ కంపెనీ విమానాలు గగణతలంలోకి ఎగరడానికి అనుమతిస్తామని ఎఎఐ ఛైర్మన్ విపి అగర్వాల్ స్పష్టం చేశారు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి.
గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications