హైదరాబాద్: కోర్టుల్లో వివాదాలు పరిష్కారం కాకపోవడంతో టెక్ మహీంద్రాలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ (ప్రస్తుతం మహీంద్రా సత్యం) విలీనం ప్రతిపాదనను మరో 6 నెలలు పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. టెక్ మహీంద్రాలో విలీన ప్రతిపాదనను ఆమోదిస్తూ గతంలో సంస్ద డైరెక్టర్లు చేసిన తీర్మానం ఈ నెలాఖరులో ముగియనున్నందున, ఈ మేరకు విలీన పథకాన్ని సెప్టెంబరు 30కి వాయిదా వేస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కి సమాచారం అందజేసింది.

మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కాంపిటేషన్ కమీషన్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాక్ ఎక్సేంజ్‌లు, వాటాదార్ల సమావేశాల్లో విలీనానికి సంస్ద అనుమతి పొందింది. ఈ నేపధ్యంలో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సత్యం కంప్యూటర్స్‌తోపాటు వెంచర్‌బే కన్సల్టెంట్స్, సీఅండ్‌ఎస్ సిస్టమ్స్ టెక్నాలజీస్, మహీంద్రా లాజిసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్, కాన్వాస్-ఎం టెక్నాలజీస్‌ల విలీనం వాయిదా పడింది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (గతంలో మేటాస్ ప్రాపర్టీస్), మైనారిటీ వాటాదారులు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన దావా పెండింగులో ఉన్నందున కంపెనీ ముందుకు వెళ్లలేదు. సత్యం కంప్యూటర్స్ తమకు రూ.1,230 కోట్లు చెల్లించాలంటూ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, స్వాప్ రేషియాను సవాల్ చేస్తూ మైనారిటీ వాటాదారులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. సత్యం కంప్యూటర్స్‌లో మెజారిటీ వాటాను 2009లో మహీంద్రా గ్రూపు దక్కించుకుంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications