చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
News
oi-Nageshwara
By Nageswara Rao
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్దిక మంత్రిత్వ శాఖ చిన్న మొత్తాల పొదుపు, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్‌లపై వడ్డీ రేట్లను 0.10 శాతం తగ్గిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు చిన్న మొత్తాల పొదుపుపై ఐదు సంవత్సరాలగాను ప్రస్తుతం ఉన్న 8.6 శాతం వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించగా.. పది సంవత్సరాలకుగాను ప్రస్తుతం ఉన్న 8.9 శాతం వడ్డీ రేటును 8.8 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే సేవింగ్స్ డిపాజిట్‌తో పాటు సంవత్సర కాలానికి గాను డిపాజిట్ చేసిన ఆదాయానికి సంబంధించి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి.వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్)పై వడ్డీరేటును సైతం 9.3 శాతం నుంచి 9.2 శాతానికి తగ్గించారు. అయితే, పోస్టాఫీసులు ఆఫర్ చేసే సేవింగ్స్ డిపాజిట్ పథకాలు(4% వడ్డీరేటు), ఏడాది వరకూ కాలవ్యవధిగల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(8.2%)పై వడ్డీరేట్లలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు.
చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లను మార్కెట్ రేటుతో అనుసంధానించాలని గతేడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంమేరకే తాజాగా వడ్డీరేట్ల సవరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ చర్యలను చేపట్టింది. కాగా, పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించడాన్ని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సమర్ధించారు. అయితే, పోస్టల్ పథకాలపై రాబడులు ఇంకా మెరుగ్గానే ఉన్నాయన్నారు.
REVISION OF INTEREST RATES
Scheme
Rate of Interest w.e.f. 01.04.2012
Rate of Interest w.e.f. 01.04.2013
Savings Deposit
4.0
4.0
1 Year Time Deposit
8.2
8.2
2 Year Time Deposit
8.3
8.2
3 Year Time Deposit
8.4
8.3
5 Year Time Deposit
8.5
8.4
5 Year Recurring Deposit
8.4
8.3
5 Year SCSS
9.3
9.2
5 Year MIS
8.5
8.4
5 Year NSC
8.6
8.5
10 Year NSC
8.9
8.8
PPF
8.8
8.7
వన్ఇండియా మనీ తెలుగు
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.