బ్యాంకింగ్ వ్యవస్దను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దుతాం: దువ్వూరి

బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంగా పటిష్టంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ మనీ అంశం కేవలం బ్యాంకింగ్ సమస్య కాదని, ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ఇదొక పెద్ద సవాల్ అని అన్నారు. సైప్రెస్ బ్యాంకింగ్ సంక్షోభం పట్ల దువ్వూరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుందని అన్నారు.
రెండు రోజుల క్రితం బ్యాంకర్ల సమావేశంలో పాల్గోన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి మ మాట్లాడుతూ దేశంలోని మూడు ప్రయివేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌లపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్రమైనవి కావని అన్నారు. మనీ లాండరింగ్‌ను అడ్డుకునే పటిష్టమైన వ్యవస్థ భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లలో మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ‘కోబ్రాపోస్ట్' అనే ఆన్‌లైన్ పోర్టల్ గత వారం ఆరోపిస్తూ సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంకర్ల సమావేశంలో పాల్గోన్న అనంతరం మాట్లాడుతూ ఆ బ్యాంకుల్లో జరిగింది కేవలం కేవైసీ (నో యువర్ కస్టమర్) ఉల్లంఘన వ్యవహారమే తప్ప ఎలాంటి కుంభకోణం జరగలేదని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆర్థిక పరమైన ఎటువంటి లావాదేవీ జరగలేదని చెప్పారు. కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌లో చోటుచేసుకున్న అంశాలన్నీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అంశాలే తప్ప, మనీ లాండరింగ్‌కు సంబంధించినవిగా భావించకూడదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధానికి అనుసరిస్తున్న విధానాలు చాలా సంపూర్ణమైనవి. ఆ విధానాలలో ఎటువంటి దోషాలు లేవని స్పష్టం చేశారు. అవసరమనిపిస్తే మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థను ఆర్‌బిఐ మరింత పటిష్టంగా, కఠినంగా తీర్చిదిద్దుతుంది.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications