
రెండు నెలల కాలంలో ఈ వడ్డీరేటు సవరించడం ఇది రెండవ సారి. జనవరి సమీక్షలో రెపోతో పాటు నగదు నిల్వల నిష్పత్తి సీఆర్‌ఆర్‌ను పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం సీఆర్‌ఆర్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో 4 శాతంగానే ఇది కొనసాగనుంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యయం పెరుగుతుండడంతో సీఆర్‌ఆర్ జోలికి ఆర్‌బీఐ వెళ్లలేదు. ఇక రెపోతో ముడిపడిఉన్న రివర్స్ రెపో రేటు కూడా పావుశాతం తగ్గడంతో ఇది 6.5 శాతానికి చేరింది. నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్‌ఆర్) మాత్రం 4 శాతంగా ఉంది.
మధ్యంతర సమీక్ష నివేదికను విడుదల చేస్తూ ఆర్‌బీఐ, ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, కరెంటు ఖాతా ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంతకంటె వడ్డీరేట్లు ఇప్పట్లో సవరించడం కష్టమని స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వృద్ధిరేటు, పెట్టుబడి పెరిగేలా చూడడం ప్రస్తుతం ఒక సవాల్. ఇందుకోసం పోటీ వడ్డీరేట్లు అవసరమే కానీ ఈ వడ్డీతగ్గింపు చాలదని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రభుత్వం తన ఖర్చులను పెంచుతుందన్న అంచనాతో ఆర్‌బీఐ సిఆర్‌ఆర్‌ను సవరించలేదు. వృద్ధిరేటు తగ్గినందున ఆర్‌బీఐ వడ్డీరేటును అరశాతం తగ్గించవచ్చునని విస్తృతంగా అంచనాలు వేశారు. ప్రస్తుత తరుణంలో ఇంతకంటె వడ్డీరేటుని తగ్గించడం కష్టమని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.
వృద్ధి వేగం తగ్గుతుందని విధాన సమీక్ష సందర్బంగా ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగుపడిందని పేర్కొంది. దేశీయ వృద్ధి వేగంలో మాత్రం తగ్గుదల చోటు చేసుకుంటుందని తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణం తిరిగి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. టోకు ధరల సూచీ, వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం మధ్య చాలా అంతరం పెరిగిందని తెలిపింది. ద్రవ్యోల్బణం పెరగడం ద్రవ్య విధాన సమీక్షకు సవాల్‌గా మారిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2012-13 అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 4.5 శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications