
పైన పేర్కొన్న కంపెనీలకు వ్యతిరేకంగా దాఖలైన చార్జిషీటులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు తాజా సమన్లు జారీ చేసింది. ఆయా కంపెనీలకు మిట్టల్, రుయా, ఘోష్‌లు చీఫ్‌లుగా ఉన్నందున వారి ఆలోచనా సరళికి తగ్గట్లుగానే వాటి పనితీరు ఉంటుందని స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైనీ అభిప్రాయపడ్డారు. వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ. 846 కోట్ల మేర ఆదాయానికి గండికొట్టారంటూ శ్యామల్ ఘోష్, మరో మూడు టెలికం కంపెనీలపై గతేడాది డిసెంబర్ 21న దాఖలు చేసిన 57 పేజీల చార్జి షీటులో సీబీఐ ఆరోపించింది.
ఎన్డీయే హయాంలో 2002లో భారతీ సెల్యులార్ (ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్), స్టెర్లింగ్ సెల్యులార్ (వొడాఫోన్ మొబైల్ సర్వీస్)కు ఢిల్లీ మెట్రో ఏరియాలోను, హచిసన్ మ్యాక్స్‌కు ముంబైలో స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయని వివరించింది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ అప్పట్లో టెలికం మంత్రిగా వ్యవహరించారు. ఇది ఇలా ఉంటే సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై సవాల్ చేస్తామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. సీబీఐ కావాలని తమ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కంపెనీ తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఇక భారతీఎయిర్‌టెల్ ప్రమోటర్లు 2007-08లో టెకోవర్ నిబంధలను ఉల్లంఘించలేదని మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెబీ పేర్కొందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. భారతి ఎయిర్‌టెల్ టేకోవర్ నిబంధ నలను అతిక్రమించిందని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సెబీ విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేలిందని ఆర్థికశాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా ఒక ప్రశ్నకు రాజ్యసభలో లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చారు. విచారణలో భాగంగా పలు వురు లేవనెత్తిన అంశాలను పరిశీలించిన తర్వాత ఎయిర్‌టెల్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని మంత్రి చెప్పారు. నవంబర్ 2012లో ఈ కేసును మూసివేయడం జరిగిందని మీనా చెప్పారు.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications