
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారులకు పోస్టల్ ద్వారా జరిగే పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కూడా తగు వ్యవస్థను తీర్చిదిద్దుతామని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 1,30,000 పోస్ట్ ఆఫీసులు ఆన్‌లైన్ సర్వీసులు అందించేందుకు వీలవుతుందని, అంతే సంఖ్యలోని పరికరాల ద్వారా ఉపాధి హామీ పథకం లబ్థిదారులకు నగదు పంపిణీ చేయడం, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ చేయడం సాధ్యపడుతుందని ఆయన తెలిపారు.
ఇన్పోసిస్ అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో ఇన్పోసిస్ టెక్నాలజీస్ సంస్ద రూ. 2,369 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతయేడాది ఇదే సమయంలో నికరలాభం రూ. 2,372 కోట్లుగా నమోదైంది. దీంతో ఈ త్రైమాసికంలో ఇన్పోసిస్ టెక్నాలజీస్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 10,424 కోట్లకు చేరింది.
ఇక ఇటీవల ఇన్పోసిస్ 'పనితీరు' బాగాలేని వారికి భారీ స్దాయిలో ఉద్వాసన పలకనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుమారుగా 5,000 వరకు ఉండొచ్చునని తెలుస్తుంది. భారీసంఖ్యలో ఇన్పోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందని, 5,000 మందికి ఉద్వాసన పలకవచ్చునని వస్తున్న వార్తల నేపధ్యంలో ఇన్పోసిస్ ఒక ప్రకటన చేసింది. పనితీరు అస్సలు బాగాలేని కొందరు ఉద్యోగులను వేరే ఉద్యోగాలు వెతుక్కోమని మాత్రమే చెప్పామని పేర్కొంది. పనితీరు బాగాలేని వారు పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది.
మరీ అస్సలు పనితీరు లేని వారిని ఇతర ఉద్యోగాలు వెతుక్కోవాలని ప్రోత్సహిస్తామని కంపెనీ వెల్లడించింది. వైదొలగమని తాము సూచించబోయే ఉద్యోగుల సంఖ్య 5,000 కన్నా చాలా తక్కువే ఉంటుందని పేర్కొంది. దాదాపు 1,50,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్న తమ స్థాయి కంపెనీల్లో ఇలాంటి పరిణామాలు సాధారణమేనని తెలిపింది. ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమేనని, తొలిసారిగా ఇప్పుడు చేయడం లేదని ఇన్సోసిస్ తన ప్రకటనలో పేర్కొంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications