మొండి బకాయిల రికవరీపై కఠినంగా వ్యవహరించండి: చిదంబరం

బ్యాంకులకు మొండి బకాయిల(ఎన్‌పీఏ) ఏ ఏడాదికి ఆ యేడాది ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2011, మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల మొత్తం స్థూల ఎన్‌పీఏలు రూ.71,080 కోట్లుగా ఉండగా... 2012 డిసెంబర్‌కల్లా ఈమొత్తం రూ.1.55 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇందులో కార్పొరేట్లకు సంబంధించి వాటా 53.68 శాతం. కాగా, ఈ కార్పొరేట్ అకౌంట్లలో రూ.100 కోట్లకు మించిన ఎన్‌పీఏ ఖాతాలు దాదాపు 172 వరకూ ఉన్నాయి. వీటి మొత్తం బకాయిల విలువ రూ. 37,194 కోట్లుగా అంచనా. కాగా, వచ్చే 2013-14 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూ బ్యాంకులకు రూ.14,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు చిదంబరం వెల్లడించారు.
మంగళవారం ప్రకటించనున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు తగిన చర్యులు తీసుకుంటారని అన్నారు. వచ్చే ఆర్దిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకులకు రూ. 14,000 కోట్ల మూల ధన నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మహిళా బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి బ్లూప్రింట్ ఏప్రిల్ చివరికల్లా సిద్ధమవుతుందని చిదంబరం చెప్పారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని మరింత సడలించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందోని అన్నారు. మూడు ప్రైవేటు బ్యాంకుల్లోని అధికారులు మనీ లాండరింగ్ సహకరించే విధంగా ప్రవర్తించారన్న ఆరోపరణలపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయని చిదంబరం అన్నారు. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల అధికారులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications