న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వచ్చే ఆర్దిక సంవత్సరంలో 1200 కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) యోచిస్తోంది. వీటితో పాటు విదేశాల్లో కొత్తగా ఎనిమిది శాఖలను కూడా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌లో రెండు, బ్రిటన్‌లో రెండు, చైనా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, శ్రీలంకలో ఒక్కొక్కటి చొప్పున శాఖలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ ఎనిమిది శాఖలు ఏర్పాటైతే, విదేశాల్లో మొత్తం ఎస్‌బీఐ శాఖల సంఖ్య 59కు పెరుగుతుంది. పెరుగుతున్న కార్యకలాపాలు తగ్గట్టుగా 1,500 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించనున్నది. వీటికి 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
దక్షణ కొరియాలో ఇప్పుడున్న కార్యాలయ స్థాయి పెంచి పూర్తి స్థాయి కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇక మన దేశంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఒక్కో రాష్ర్టంలో వంద శాఖలను ఏర్పాటు చేయనుంది. అక్టోబర్-డిసెంబర్ మాసాలలో బ్యాంక్ లాభం 4 శాతం పెరిగి 3,396 కోట్ల రూపాయలు సాధించింది.
గత ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం లాభం 29 ఈ మాసాలలో 29,787 కోట్ల రూపాయలుండగా, ఈ ఏడాది 33,992 కోట్ల రూపాయలను సాధించింది.
వన్ఇండియా తెలుగు మనీ
Share This Article
English summary
విదేశాల్లో 8, భారత్‌లో 1200 కొత్త శాఖలు: ఎస్‌బీఐ | SBI to open 1,200 branches, 8 overseas offices next fiscal | విదేశాల్లో 8, భారత్‌లో 1200 కొత్త శాఖలు
State Bank of India (SBI) plans to open about 1,200 branches in the country and another eight branch offices overseas, including China and the UK, in the next fiscal.
Story first published: Monday, March 18, 2013, 18:48 [IST]
Other articles published on
Mar 18, 2013