60 రోజుల అడ్వాన్స్ ఆఫర్ ఢిల్లీ - హైదరాబాద్ రూ. 4,376లకే

ఈ పథకం వివరాలను తీసుకుంటే అన్ని చార్జీలూ కలిపి టికెట్ రేటుని నిర్ణయించామని అన్నారు. ఈ ఆఫర్ ప్రకారం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి 60 రోజుల ముందు బుక్ చేసుకుంటే (మే లో ప్రయాణానికి) టికెట్ ధర సుమారు రూ. 4,376గా ఉండనుంది. తక్షణ ప్రయాణాలకి ప్రస్తుతం ఈ రేటు దాదాపు రూ. 8,900 పైచిలుకు ఉంది. రైలు ప్రయాణాలకు సంబంధించి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ. 4,293గా ఉంది. ఈ టికెట్లను ట్రావెల్ ఎజెంట్లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఎజెంట్లు, ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ మరియు బుకింగ్ కార్యాలయాల నుంచి కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. గత నెలలో స్పైస్‌జెట్ జనవరిలో అత్యంత తక్కువగా రూ. 2,013కే టికెట్లు ప్రకటించడంతో జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, గో ఎయిర్ వంటి కంపెనీలు రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.
60 రోజుల అడ్వాన్స్ ఆఫర్ ఛార్జీలు:
న్యూఢిల్లీ - హైదరాబాద్ చార్జీ రూ. రూ. 4,376
న్యూఢిల్లీ - ముంబై చార్జీ రూ. 3,981
న్యూఢిల్లీ - చెన్నై చార్జీ రూ. 3,769
న్యూఢిల్లీ - లక్నో చార్జీ రూ. 2,566
ముంబై - కోల్‌కతా చార్జీ రూ. 4,819
ముంబై - బెంగళూరు చార్జీ రూ. 2,930
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications