
కంపెనీ నమోదు సంబంధిత కార్యకలాపాలు జరుగుతున్నాయని, అవసరమైన డాక్యుమెంట్లను, సర్టిఫికెట్లను సదరు మంత్రిత్వ శాఖకు సమర్పిస్తున్నామని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ దేశీయ ఎయిర్‌లైన్స్‌లో విదేశీ విమానయాన కంపెనీలకు 49 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తన విధివిధానాలను సడలించడంతో.. దీనికి అనుగుణంగానే ఎఫ్‌ఐపీబీ ఈ కొత్త జేవీకి అనుమతి ఇచ్చింది. ప్రతిపాదిత కొత్త ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
చెన్నై నుండి ఒక స్మార్ట్ బాయ్‌ని సీఈఓగా నియమించామని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. ఇతని రెజ్యుమో అద్బుతంగా ఉంది. ఇతను తప్పక అందరినీ ఆకట్టుకోగలడని అన్నారు. ఈ స్మార్ట్ బాయ్‌కు చెందిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. కంపెనీ ఎదిగే కొద్ది మరింత మందిని ఉద్యోగంలో తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి ఎయిర్ క్రాప్ట్‌కి సుమారు 20 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విమానయాన సంస్ద సేవలు ప్రారంభించగదలని ఇటీవల మలేసియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తెలిపిన విషయం తెలిసిందే.
మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ఈ ఎయిర్‌లైన్స్ తక్కువ చార్జీల విధానాన్నే కస్టమర్స్‌కు అందిస్తుంది. మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. భారత్‌లో ఎయిర్‌ఏషియా జెట్ ఎయిర్‌వేస్, స్పయిస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్‌తో పాటు ఎయిర్ ఇండియాతో పోటీపడతాయి.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications