వన్ఇండియా తెలుగు మనీ మీకోసం ప్రత్యేకించి అన్ని బ్యాంకులకు సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కు చెందిన వడ్డీ రేట్లను అందిస్తుంది. కెనరా బ్యాంకు, ING వైశ్యా బ్యాంకుల్లో మీ డబ్బుని 2-3 సంవత్సరాలకు గనుక ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లైతే అత్యధిక వడ్డీ రేటుని అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. అంటే ఏదైనా బ్యాంకులో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే దానిపై ఏడాదిలోపు వచ్చే వడ్డీ పదివేలు దాటితే 10.3 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.
అంతేకాదండోయ్ మీ డబ్బును ఆదాయం లేని మీ పిల్లల పేర్లు మీదనో, మీ భార్య పేరు మీదనో డిపాజిట్ చేసినా కూడా ఆ వడ్డీని మీ ఆదాయంగానే పరిగణనలోనికి తీసుకోని పన్ను వేస్తారు. ఐతే, మీ ఆదాయ మార్గాలన్నీ చూపి, పాన్ కార్డు నెంబర్‌ను ఇచ్చి, వడ్డీ కలిపినా మీ ఆదాయం రూ. 2 లక్షలకు పైగా ఉండనట్లైతే పన్ను నుండి మీరు తప్పించుకున్నట్లే. ఇప్పటికే మీ ఆదాయం రెండు లక్షలు దాటి ఉంటే పన్ను భారం తగ్గించుకోవడానికి వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరు మొత్తాల్లో పొదుపు చేయాలి. వడ్డీ పదివేలకు మించకుండా విభజించి చిన్నమొత్తాలుగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అనేది ఒక రకమైన పెట్టుబడి రూపం. మీరు ఆసక్తితో ఒక నిర్దిష్ట కాలంతో నిర్దిష్ట రేటుతో పెట్టుబడిని పెట్టినట్లైతే ఎక్కువ మొత్తంలో వడ్డీ రేటుని అందిస్తుంది. ఈ క్రింద పలు బ్యాంకుల వడ్డీ రేట్లు పరిశీలించండి.
Fixed Deposit Rates
| Bank | 1-2 Years(in percentage) | 2-3 Years |
| Axis Bank | 8.50-9.00 | 9.00 |
| Bank of Baroda | 9.00 | 9.00 |
| Bank of India | 9.00-9.25 | 9.00 |
| Canara Bank | 9.05 | 9.05 |
| Central bank of India | 9.00 | 8.75 |
| Corporation Bank | 8.75-9.00 | 8.75 |
| HDFC Bank | 8.00-8.75 | 8.75 |
| ICICI Bank | 7.50-9.00 | 8.75 |
| IDBI Bank | 8.75-9.00 | 9.00 |
| ING Vysya | 9.25 | 9.25 |
| State Bank of India | 8.75 | 8.75 |
| Syndicate bank | 8.75 | 8.75 |
| Federal Bank | 9.00-9.25 | 9.00 |
| Union bank of India | 9.00 | 9.00 |
| Vijaya Bank | 9.00-9.25 | 9.00 |
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications