
ఉత్పాదక రంగానికి చేయూత నిచ్చేందుకు 15 శాతం పెట్టుబడులు కేటాయించామని, ఆర్థిక వృద్ధికి చేయూత నిచ్చే విధంగా వౌలికసదుపాయాల కల్పనలో పెట్టుబడులను ప్రోత్సాహించే రీతిలో చర్యలను ప్రతిపాదించాం. మధ్యతరగతి, పేదలను దృష్టిలో ఉంచుకుని, ద్రవ్యోల్బణం అదుపు చేసే రీతిలో వివిధ చర్యలు చేపట్టామని దీనిలో భాగంగానే ‘ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్ల'ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఆర్‌బీఐ ఈ నెల 19న మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ప్రభుత్వం వచ్చే ఏడాది.. ఈసారి కన్నా స్థూలంగా రూ. 10,000 కోట్లు మాత్రమే అధికంగా రుణాలు సమీకరిస్తుందని, నికరంగా ఇది రూ. 5,000 కోట్ల మేరకు ఉంటుందని చిదంబరం చెప్పారు.
మహిళా సిబ్బందితో పనిచేసే బ్యాంకు విధివిధానాల రూపకల్పన కోసం బ్యాంకర్లు, ఇతర నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. దీనికి కెనరా బ్యాంక్ మాజీ చైర్మన్ ఎంబీఎన్ రావు సారథ్యం వహిస్తారు. ఈ కమిటీ ఏప్రిల్ 30లోగా నమూనా ప్రణాళిక సమర్పిస్తుందన్నారు. కమిటీలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో కె. రామకృష్ణన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్, ఎస్‌బీఐ క్యాప్స్ ఎండీ అరుంధతి భట్టాచార్య, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీఎండీ ఎం.డి. మాల్యా, ఎస్‌ఈడబ్ల్యూఏ ఎండీ జయశ్రీ వ్యాస్ సభ్యులుగా ఉంటారు. మహిళా బ్యాంకును నవంబర్‌లో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డి.సుబ్బారావు, డిప్యూటీ గవర్నర్ కెసి చక్రవర్తి, ఆనంద్ సిన్హా, హెచ్‌ఆర్ ఖాన్, అర్జిత్ ఆర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
దేశ వృద్ధికి తోడ్పడాలంటే, ముందు ధరలు స్థిరంగా ఉంటేనే సాధ్యపడుతుందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. నిలకడగా అధిక వృద్ధి సాధించాలన్న భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండాలని బ్యాంకర్ల సదస్సులో దువ్వూరి పేర్కొన్నారు.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications