న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని భారత బిజినెస్ రంగంలో తన సత్తా చాటుతున్న మహిళల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బిజినెస్ పరంగా మహిళలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వారిని తారాపథంలో నడిపిస్తున్నాయి. ఇప్పటికీ భారతదేశంలో మహిళలు డబ్బుకోసం తమ తల్లిదండ్రులు, అన్నలు లేదా భర్తలపై ఆధారపడాల్సి వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని ఆసోచామ్ నిర్వహించిన టాప్ 20 మహిళల సర్వేలో భారత మహిళల గురించి తెలుసుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు కొన్ని కంపెనీలు ఆఫర్స్‌ను ఇస్తున్నాయి. ఉద్యోగం చేసే చోట మహిళా సిబ్బందికి మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు టెలికం దిగ్గజం వొడాఫోన్ పూర్తిగా మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నడిచే రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తోంది.
ఎంటీఎస్ బ్రాండ్ పేరిట సర్వీసులు అందించే మరో టెలికం ఆపరేటరు సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్‌ఎస్‌టీఎల్) కూడా సరికొత్త ఆఫర్లతో మహిళా సబ్‌స్క్రయిబర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళల ఆత్మ రక్షణకు తోడ్పాటు అందించేలా ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టింది.

చందా కొచ్చర్:
చందాకొచ్చర్ 1984లో ఐసీఐసీఐ బ్యాంకులో మేనేజ్ మెంట్ ట్రైనీ గా చేరారు. ఈరోజు ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకులో అంతటి గొప్ప పదవిని నిర్వహిస్తున్న మొట్టమొదటి మహిళ ఈమె కావడం విశేషం.
చందా కొచ్చర్ సారధ్యంలో 2001, 2003, 2004, 2005వ సంవత్సరానికి "భారతదేశం లో ఉత్తమ రిటైల్ బ్యాంక్" అవార్డుని సొంతం చేసుకుంది. 2004వ సంవత్సరానికి చందా కొచ్చర్‌ని రీటైలర్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. 2010లో భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మభూషణ్ అవార్డు కూడా ఈమెను వరించింది.

ఇందిరా క్రిష్టమూర్తి నూయి:
ఇందిరా క్రిష్టమూర్తి నూయి పెప్సికో కంపెనీకి ఛైర్మన్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నూయి తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. 2009వ సంవత్సరంలో బ్రెండన్ వుడ్ ఇంటర్నేషనల్ అనే అడ్వజైరీ ఏజెన్సీ టాప్ గన్ సీఈవోలలో ఈమెను ఒకరిగా పేర్కొంది. ఇక 2010లో ఫార్చున్ మ్యాగజైన్ ప్రకటించిన "50 మోస్ట్ పవర్ పుల్ ఉమెన్" లలో #1 స్దానాన్ని కైవసం చేసుకోగా.. అదే సంవత్సరంలో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో కెల్లా 100 మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ జాబితాలో #6వ స్దానాన్ని కైవసం చేసుకున్నారు.

కిరణ్ ముంజుదార్ షా:
కిరణ్ ముంజుదార్ షా ఒక పారిశ్రామిక వేత్త. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి బయోకాన్ సంస్ద చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. 2002లో కిరణ్ ముంజుదార్ షా కర్ణాటక ప్రభుత్వం ఇచ్చేటటువంటి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతో పాటు బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ - 2012లో 80వ ర్యాంకుని సొంతం చేసుకున్నారు.

నైనా లాల్ కిద్వాయ్:
నైనా లాల్ కిద్వాయ్ ఇండియన్ బ్యాంకర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం ఈమె భారతదేశానికి చెందిన HSBC ఇండియా గ్రూప్ అధిపతిగా ఉన్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి పట్టా పొందారు. ట్రేడ్, ఇండస్ట్రీ రంగంలో ఈమె అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈమెను పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ డిపాజిట్లపై సాధారణ రేటు కంటే 0.4% అధిక వడ్డీ ఇస్తోంది. 400 రోజుల డిపాజిట్ పథకంపై 9.4 %, సీనియర్ సిటిజన్స్‌కి 9.9% వడ్డీ రేటు ప్రకటించింది. మహిళల పేరున ఉమ్మడిగా చేసే డిపాజిట్‌లకూ ఈ రేటు లభిస్తుంది. గురువారం మొదలైన ఈ పథకం ఇవాళ, రేపు(8, 9 తేదీల్లో) మాత్రమే అందుబాటులో ఉంటుంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications