బ్యాంకింగ్ లైసెన్సుల సందేహాలపై స్పష్టత ఇస్తాం: ఆర్‌బీఐ

అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో కొత్తగా ప్రైవేట్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఆర్‌బీఐ ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. దేశంలో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్‌బీఐ 1993లో ప్రకటనను జారీ చేసింది. అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 10 కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరయ్యాయి. చివరిసారిగా భారత్‌లో బ్యాంకింగ్ లెసైన్స్‌లు 2001లో జారీ అయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్(2004లో)లు అప్పుడు వచ్చినవే. అంటే సుమారు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ బ్యాంకింగ్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్ చేసింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 26 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, 22 ప్రైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇటీవలే బ్యాంకింగ్ రేసులోకి తాము ప్రవేశిస్తామని వీడియోకాన్ సంస్ద ప్రకటించింది. ఈ సందర్బంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ మాట్లాడుతూ విదేశీ భాగస్వామితో ఓ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఇందుకు 1,000 కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. లిబర్టీ మ్యూచువల్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే ఫైనాన్షియల్ రంగంలో ఉన్నాం. ఇప్పుడు కొత్త బ్యాంకుల కోసం ఆర్‌బిఐ ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలతో బ్యాంకింగ్ రంగంలోకి వస్తున్నాము. ఇప్పుడు ఆర్‌బీఐ మార్గదర్శకాలు వచ్చిన నేపథ్యంలో లెసైన్స్‌కు దరఖాస్తు దాఖలు చేస్తున్నామని అన్నారు.
ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగం ఎంతో పురోగతి సాధించగా, ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఎన్నో కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ లతోపాటు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్, శ్రీరామ్ క్యాపిటల్, ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసి, ఇండియా పోస్ట్ వంటివి బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టాలని ఆలోచనలో ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా మనీ


Click it and Unblock the Notifications