కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్దిరాస్తులు జప్తు చేయాలంటున్న ఎస్‌బీఐ

Kingfisher Airlines
హైదరాబాద్: రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ స్దిరాస్తులను జప్తు చేయాలని నిర్ణయించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎండీ ఎ. కృష్ణ కుమార్ తెలిపారు. ఎలాగైనా సరే కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన రుణాలను రాబట్టుకునే కార్యక్రమంలో జప్తుకి సంబంధించి కొన్ని ఆస్తులను గుర్తించామని అన్నారు. త్వరలో మరికొన్ని ఆస్తులను గుర్తించేందుకు, తదుపరి చర్యలపై న్యాయ సలహాలను తీసుకునేందుకు నాలుగు బ్యాంకులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశామని కృష్ణ కుమార్ తెలిపారు. మరోవైపు, ఈ ఏడాది సుమారు 1,200 మంది సిబ్బందిని తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.

వచ్చే మూడు, నాలుగేళ్లలో దాదాపు 40 శాతం మంది రిటైరవుతున్న నేపథ్యంలో బ్యాంకు ఇప్పటికే భారీగా రిక్రూట్‌మెంట్స్ చేపట్టినట్లు కృష్ణకుమార్ తెలిపారు. గడిచిన అయిదేళ్లలో 40,000 మంది ఉద్యోగులు రిటైరయ్యారని, ప్రస్తుతం మొత్తం సిబ్బంది సంఖ్య 2.2 లక్షలుగా ఉందన్నారు. ఖాతాదారుల సంఖ్య ఈ ఏడాది ఆఖరుకు 25 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కృష్ణకుమార్ చెప్పారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 25,000 ఏటీఎంలు, 600 పైగా నగదు డిపాజిట్ మెషీన్లు (సీడీఎం) ఉన్నాయని కృష్ణ కుమార్ చెప్పారు. 2014 ఆఖరు నాటికి ఈ సంఖ్యను 5,000కి పెంచుకోనున్నట్లు తెలిపారు.

కింగ్‌ఫిషర్‌ బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు రూ.7,500 కోట్లకు పైగా చేరాయని... కెఎఫ్‌ఏ కు చెందిన ముంబయి, గోవా ఆస్తులు విక్రయిస్తే సుమారు రూ.120 కోట్లు రాబట్టుకోవచ్చునని కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవలే కింగ్‌ఫిషర్‌కు చెందిన దేశీయ ఫ్లయింగ్ స్లాట్‌లతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా స్లాట్‌లను రద్దు చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌కు కేటాయించిన స్లాట్‌లను రద్దు చేయడంతో.. ఈ స్లాట్‌లను వేరే విమానయాన కంపెనీలకు అందుబాటులో ఉంచాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆదేశించింది.

గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సేవలను తిరిగి పునరుద్దణ చేసేందుకు తమకు అనుమతివ్వాలని ఆ కంపెనీ సీఈవో సంజయ్ అగర్వాల్‌ డైరెక్టరెట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ)ను కలిసి మరో సారి కోరినట్లు సమాచారం. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.

వన్ఇండియా తెలుగు మనీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+