
ఈ జాయింట్ వెంచర్‌లో టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌కు 30 శాతం, మరో ఇన్వెస్టర్ అరుణ్ భాటియాకు చెందిన టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు 21 శాతం చొప్పున వాటాలు ఉండేలా ఒప్పందం కుదిరింది. 49 శాతం మెజారిటీ వాటా మాత్రం ఎయిర్ ఏషియా తీసుకోనుంది. ఎఫ్‌ఐబి ఆమోదం పొందితే జాయింట్ వెంచర్ కంపెనీ ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఎకు దరఖాస్తు చేయనుంది. విమానయాన సర్వీసులు నిర్వహించేందుకు డీజీసీఎ అనుమతి మంజూరు చేస్తుంది. కంపెనీ ఎదిగే కొద్ది మరింత మందిని ఉద్యోగంలో తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి ఎయిర్ క్రాప్ట్‌కి సుమారు 20 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విమానయాన సంస్ద సేవలు ప్రారంభించగదలని ఇటీవల మలేసియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తెలిపిన విషయం తెలిసిందే. మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ఈ ఎయిర్‌లైన్స్ తక్కువ చార్జీల విధానాన్నే కస్టమర్స్‌కు అందిస్తుంది. మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు.
ఇటీవలే పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్‌ను టాటా గ్రూప్ సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఈ విషయమై కలిశారు. కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎయిర్ ఏషియా పెట్టుకున్న జేవీ దరఖాస్తును ఎఫ్‌ఐపీబీ పరిశీలించనున్న ఒక రోజు ముందు కంపెనీకి ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అమల్లో ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకే వర్తిస్తాయని విమానయాన శాఖ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications