
భారతదేశంలో ఉన్న 1.87 కోట్ల గృహకల్పనా లోటును కొంత మేరకు తీర్చేందుకు చిదంబరం కొన్ని ప్రతిపాదనులు తన బడ్జెట్‌లో చేశారు. అవెంటో చూద్దాం.
గ్రామీణ హౌసింగ్ ఫండ్ కేటాయింపులు ఈ ఏడాది రూ.4 వేల కోట్ల నుంచి రూ. 6 వేల కోట్లకు పెంచారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల డిమాండ్ నెరవేర్చడానికి ఉద్దేశించి ఒక ఫండ్‌ను ప్రతిపాదించారు. ఈ ఫండ్‌ను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ఫండ్‌కు రూ. 2,000 కోట్లు అందించాలని ఇందుకు తగిన ప్రతిపాదనలు చేశారు.
మొదటిసారి ఇంటి రుణం తీసుకొనే వారు చెల్లించే వడ్డీపై లభించే మినహాయింపులను లక్షకు పెంచారు. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24ప్రకారం రుణం తీసుకున్న ఇంటిలో నివసిస్తుంటే చెల్లించే వడ్డీపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. తక్కువ వ్యయంతో కూడిన ఇళ్లకు ప్రస్తుతం ఇస్తున్న సేవల పన్ను మినహాయింపులను కొనసాగించారు.
ఇది ఇలా ఉంటే లగ్జరీ ఇళ్లు మాత్రం మరింత ప్రియం కానున్నాయి. రూ. కోటి దాటిన లేదా 2,000 చదరపు అడుగుల పైన కార్పెట్ ఏరియా ఇళ్లు, ఫ్లాట్స్‌పై సేవల పన్నుపై ప్రస్తుత 75% మినహాయింపును 70%కి తగ్గించారు. రూ. 50 లక్షలు దాటిన స్దిరాస్తి బదలాయింపుపై 1% టీడీఎస్ విధించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications