
మార్చి నాటికి ద్రవ్యోల్బణం 6.2 నుంచి 6.6 శాతం మధ్యలో ఉంటుందని... 2012 ఏప్రిల్-డిసెంబరు మధ్య సగటు ద్రవ్యోల్బణం 7.75 శాతంగా ఉందని ఎకామిక్ సర్వే తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గే సూచన ఉన్నందున రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గిస్తుందని అభిప్రాయపడింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఎక్కువగా ఉందని.. ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల కూడా ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడిందని సర్వే విశ్లేషించింది.
ఎకానమిక్ సర్వే 2013లో ముఖ్యాంశాలు:
* వడ్డీ రేట్ల తగ్గింపు పెట్టుబడులకు ఊతమిస్తుంది.
* ద్రవ్యలోటు నియంత్రణకు పన్ను పరిధి పెంచాలి.
* రైల్వేల్లో సరకు రవాణా 5.1 శాతం వృద్ది.
* 295.6 బిలియన్ డాలర్ల వద్ద నిలకడగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు
* 2012 డిసెంబర్ నాటి స్దాయిలో కొనసాగుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు
* రాయితీల భారాన్ని తగ్గించుకోవడానికి డీజిల్, ఎల్‌పీజీ ధరలు మరింత పెంచాలి.
* ఆర్దిక మందగమనం సంస్కరణల మేలుకొలుపు
* ఆర్ధిక మందం దాదాపు ఆగిపోయింది.
* 2013-14 ఆర్దిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.6 నుండి 6.2 శాతానికి తగ్గుతుంది.
* చెల్లింపుల్లో లోటు నియంత్రించేందుకు బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించాలి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications