
కింగ్‌ఫిషర్ దేశీయ, విదేశీ సర్వీసులను నిలిపేయడం, ఈ స్లాట్‌లను ఉపయోగించుకోకపోవడం వల్లే ఫ్లయింగ్ స్లాట్‌లను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని... ఇతర ఎయిర్‌లైన్స్‌కు వీటిని కేటాయించనున్నట్లు సమాచారం. సుమారుగా 8 దేశాలకు సంబంధించిన 126 అంతర్జాతీయ ఫ్లయింగ్ స్లాట్స్ కింగ్‌ఫిషర్‌కు ఉండేవి. వీటిని రద్దు చేయడం వల్ల ఇతర దేశీ ఎయిర్‌లైన్స్‌కు సుమారుగా వారానికి 25 వేల సీట్లు ఈ 8 దేశాల రూట్లలో అందుబాటులోకి రానున్నాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సేవలను తిరిగి పునరుద్దణ చేసేందుకు తమకు అనుమతివ్వాలని ఆ కంపెనీ సీఈవో సంజయ్ అగర్వాల్ డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)ను కలిసి మరో సారి కోరినట్లు సమాచారం. ఐతే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ తమకు చెల్లించాల్సిన రూ. 390 కోట్ల పన్నులు చెల్లించాకే తిరిగి ఆ కంపెనీ విమానాలు గగణతలంలోకి ఎగరడానికి అనుమతిస్తామని ఎఎఐ ఛైర్మన్ విపి అగర్వాల్ స్పష్టం చేశారు.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications