బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం: పీఎఫ్‌సీ కంపెనీ సీఎండీ

కొత్తగా బ్యాంక్ ఏర్పాటు లేదా ఇప్పుడున్న సంస్థనే బ్యాంకుగా మార్చుకునేందుకు మాకు అవకాశం ఉందన్నారు. బ్యాంక్ ఏర్పాటు విషయాన్ని బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక కొత్తగా బ్యాంక్ లైసెన్స్‌కి బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తుకోసం చివరి గడువు జూలై 1 అని నిర్ధారించింది. భారత బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేందుకు పదికిపైగా కార్పొరేట్ కంపెనీలు, పీఎస్‌యూలు పోటీపడుతున్నాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఆదిత్య బిర్లా, అనిల్ అంబానీ గ్రూప్‌లతో పాటు శ్రీరామ్ గ్రూప్‌లు ప్రైవేటు రంగంలో ప్రధానంగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో పీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ, ఇండియా పోస్ట్‌లు ఉన్నాయి.
ముఖ్యాంశాలు:
* కొత్తగా బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు 25 శాతం శాఖలను బ్యాంకింగ్ కార్యకలాపాలు లేని గ్రామీణ ప్రాంతాలలో శాఖలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
* విదేశీ పెట్టుబడులు 49 శాతం మించకూడదు.
* కనీస పెట్టుబడి రూ. 500 కోట్ల రూపాయలు ఉండాలి.
* ప్రస్తుత ఎన్‌బిఎఫ్‌సిలు కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయవచ్చు లేదా ఉన్న వాటిని బ్యాంకులుగా మార్చవచ్చు.
* లెసైన్స్ లభించాక ఏడాదిలోగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలి. ఆతర్వాత మూడేళ్లలోపు సంబంధిత కొత్త బ్యాంకును స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయాలి.
* బ్యాంకుల కోసం దరఖాస్తు చేసిన సంస్థలు, కంపెనీల గురించి ఆర్‌బిఐ ఐటి,సిబిఐ, ఇడి శాఖల నుంచి ఆ సంస్థల గురించి వివరాలు తెలుసుకుంటుంది.
* కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే బ్యాంకుల వల్ల ఆయా ప్రమోటర్లకు అనుచిత లబ్ధికి దారితీయొచ్చనే భయాలను తొలగించేందుకు కూడా ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో కొన్ని నిబంధనలను చేర్చింది.
* సంబంధిత కార్పొరేట్ స్వరూపంపై ఆర్‌బీఐ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే లెసైన్స్‌లకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది.
* అంతేకాకుండా ఎన్‌ఓహెచ్‌ఎఫ్‌సీ, దాని సబ్సిడరీలు/జాయింట్ వెంచర్స్/అనుబంధ సంస్థలతో పాటు కొత్త బ్యాంకును కూడా ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
* కొత్త బ్యాంకుల డెరైక్టర్ల బోర్డుల్లో మెజారిటీ సంఖ్యలో స్వతంత్ర డెరైక్టర్లు ఉండాలి.
2014 మార్చి చివరకు కొత్త బ్యాంకుకు తొలి లైసెన్స్ లభిస్తుందని ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ కార్యదర్శి రాజీవ్ తెలిపారు. దేశంలో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్‌బీఐ 1993లో ప్రకటనను జారీ చేసింది. అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 10 కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరయ్యాయి. చివరిసారిగా భారత్‌లో బ్యాంకింగ్ లెసైన్స్‌లు 2001లో జారీ అయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్(2004లో)లు అప్పుడు వచ్చినవే. అంటే సుమారు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ బ్యాంకింగ్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్ చేసింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 26 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, 22 ప్రైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications