కొత్త బ్యాంకుల లైసెన్స్ తుది మార్గదర్శకాలను విడుదల చేసిన ఆర్‌బీఐ

RBI
ముంబై: దేశీయ బ్యాంకింగ్ రంగంలో సరికొత్త నాందికి తెరలేవనుంది. కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తూ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఎట్టకేలకు శుక్రవారం అవసరమైన తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పదేళ్లపాటు విజయవంతమైన వ్యాపార అనుభవంతో పాటు పటిష్టమైన ఆర్థిక, పనితీరు మూలాలు ఉన్న కార్పొరేట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు లెసైన్స్ పొందే అర్హత ఉంటుంది. ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగంలోని కంపెనీలు/గ్రూప్‌లతో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీలు) బ్యాంకింగ్ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టేందుకు వీలుకల్పించింది.

ఎంతో కాలం నుండి వేచిచూస్తున్న అనిల్ అంబానీ గ్రూప్‌తో పాటు ఎల్‌అండ్‌టీ, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ తదితర కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా బ్యాంకింగ్ లెసైన్స్‌లు దక్కనున్నాయి. దీంతోపాటు పోస్టల్ శాఖ, ఎల్‌ఐసీ వంటి దిగ్గజాలకూ ఆర్‌బీఐ బ్యాంకింగ్ అవకాశం కల్పించనుంది. బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తుకోసం చివరి గడువు జూలై 1 అని నిర్ధారించింది. ఐతే ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో ఎన్ని లైసెన్స్‌లను మంజూరు చేస్తారనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ముఖ్యాంశాలు:
* కొత్తగా బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు 25 శాతం శాఖలను బ్యాంకింగ్ కార్యకలాపాలు లేని గ్రామీణ ప్రాంతాలలో శాఖలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
* విదేశీ పెట్టుబడులు 49 శాతం మించకూడదు.
* కనీస పెట్టుబడి రూ. 500 కోట్ల రూపాయలు ఉండాలి.
* ప్రస్తుత ఎన్‌బిఎఫ్‌సిలు కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయవచ్చు లేదా ఉన్న వాటిని బ్యాంకులుగా మార్చవచ్చు.
* లెసైన్స్ లభించాక ఏడాదిలోగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలి. ఆతర్వాత మూడేళ్లలోపు సంబంధిత కొత్త బ్యాంకును స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయాలి.
* బ్యాంకుల కోసం దరఖాస్తు చేసిన సంస్థలు, కంపెనీల గురించి ఆర్‌బిఐ ఐటి,సిబిఐ, ఇడి శాఖల నుంచి ఆ సంస్థల గురించి వివరాలు తెలుసుకుంటుంది.
* కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే బ్యాంకుల వల్ల ఆయా ప్రమోటర్లకు అనుచిత లబ్ధికి దారితీయొచ్చనే భయాలను తొలగించేందుకు కూడా ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో కొన్ని నిబంధనలను చేర్చింది.
* సంబంధిత కార్పొరేట్ స్వరూపంపై ఆర్‌బీఐ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే లెసైన్స్‌లకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది.
* అంతేకాకుండా ఎన్‌ఓహెచ్‌ఎఫ్‌సీ, దాని సబ్సిడరీలు/జాయింట్ వెంచర్స్/అనుబంధ సంస్థలతో పాటు కొత్త బ్యాంకును కూడా ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
* కొత్త బ్యాంకుల డెరైక్టర్ల బోర్డుల్లో మెజారిటీ సంఖ్యలో స్వతంత్ర డెరైక్టర్లు ఉండాలి.

2014 మార్చి చివరకు కొత్త బ్యాంకుకు తొలి లైసెన్స్ లభిస్తుందని ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ కార్యదర్శి రాజీవ్ తెలిపారు. దేశంలో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్‌బీఐ 1993లో ప్రకటనను జారీ చేసింది. అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 10 కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరయ్యాయి. చివరిసారిగా భారత్‌లో బ్యాంకింగ్ లెసైన్స్‌లు 2001లో జారీ అయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్(2004లో)లు అప్పుడు వచ్చినవే. అంటే సుమారు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ బ్యాంకింగ్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్ చేసింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 26 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, 22 ప్రైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+