రూ. 12,300 కోట్ల విలువైన షేర్లను ట్రస్ట్‌కు బదిలీ చేసిన అజీమ్ ప్రేమ్‌జీ

అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ 2001లో ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలను ఆయా రాష్ర్ట ప్రభుత్వాల సహకారంతో ఈ ఫౌండేషన్ చేపడుతోంది. ముఖ్యంగా విద్యాపరమైన కార్యక్రమాలకు ట్రస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. ఫౌండేషన్ తరఫున దేశవ్యాప్తంగా సుమారు 800 మంది కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా బెంగళూరులో అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతోపాటు, మూడు రాష్ట్రాలు, పలు జిల్లాలలో పలు రకాల విద్యా సంస్థలను సైతం నెలకొల్పింది.
ఈ నెల 19న అజీమ్ ప్రేమ్‌జీ గత రెండు సంవత్సరాల నుంచి ఫౌండేషన్ చేస్తున్న పనులు తనను సంతృప్తి చెందానన్నారు. సమాజంలో బాగా డబ్బున్న వారు దేశంలో కోట్లాది మంది ప్రజలు కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా ఉన్న వారిని ఆదుకోవాలని గట్టిగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. తాను ఆదశగానే పయనిస్తానని చెప్పారు. ప్రేమ్‌జీ తనపై గాంధీజీ ప్రభావం చాలా గాఢంగా ఉందని చెప్పారు. స్వాతంత్య్రం కోసం ఆయన పోరాటం తనకు స్పూర్తికలిగించిందన్నారు.
తమ వద్ద ఉన్న సంపదను ప్రస్తుత సమాజం బాగోగుల కోసం వినియోగించాలన్న గాంధీజీ సూక్తులు తాను పాటిస్తున్నానని అన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ తన జీవితం గురించి మాట్లాడుతూ తన తండ్రి అకాలమరణంతో..1966 స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకు స్వస్తి చెప్పి భారత్‌కు వచ్చానని, ఆ తర్వాత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పారు. తన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ తాను 2000 సంవత్సరంలో పూర్తి చేశానని ప్రేమ్‌జీ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విప్రో కంపెనీ గ్లోబల్ ఐటీ బ్రాండ్ అయిందన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications