
నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) విధానం క్రింద మొదటి ఇన్‌ఫ్రా డెట్ ఫండ్స్ (ఐడీఎఫ్) ఇదే కావడం విశేషం. రూ. 300 కోట్ల ఈక్విటీ మూలధనంతో నాలుగు ఆర్థిక రంగ దిగ్గజాలు ఐడీఎఫ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ ప్రమోటర్లలో ఐసీఐసీఐ గ్రూప్‌కి 31 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాకి 30 శాతం, సిటీ గ్రూప్‌కి 29 శాతం, ఎల్‌ఐసీకి 10 శాతం వాటా ఉంది. దేశ, విదేశీ డెట్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించాక... 2 బిలియన్ డాలర్ల వరకూ రుణాలను అందించేందుకు ఈ ఫండ్‌కు అవకాశం లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంకు కింగ్‌ఫిషర్‌తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్‌కార్డును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రుణ సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అప్పుల్లో కూరుకుపోయి సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్ సర్వీసులు నిలిపివేసినందు వల్ల తాము క్రెడిట్ కార్డు సర్వీసులను నిలినివేస్తున్నట్లు బ్యాంకు కస్టమర్లకు తెలియజేసింది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సర్వీసులు మార్చి 31, 2013 వరకు మాత్రమే కొనసాగుతాయి. వినియోగదారులు కావాలంటే తమ బ్యాంకు నుంచి వేరే క్రెడిట్‌కార్డులకు మారిపోవచ్చునని బ్యాంకు తన వినియోగదారులకు సలహా ఇచ్చింది.
ప్రస్తుతం ఐసీఐసీఐ - కింగ్‌ఫిషన్ కార్డు వినియోగించుకునే వారికి కావాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు ప్లాటినం వీసా కార్డును జారీ చేస్తామని దానికి ఎలాంటి రుసము తీసుకోమని మార్చి 15వ తేదీ తర్వాత ఈకార్డును విడుదల చేస్తామని వడ్డీరేట్లు , క్రెడిట్ లిమిట్ అంతా ప్రస్తుతం యధావిధిగా కొనసాగుతుందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపంది. కస్టమర్లు కావాలనుకుంటే కొత్త కార్డుకు మారవచ్చునని తెలిపింది. కింగ్‌ఫిషర్‌కు రుణాలు ఇచ్చిన కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి. ఐసీఐసీఐ బ్యాంకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు సుమారు రూ. 430 కోట్ల రుణం ఇచ్చింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications