
రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ తేడాది మే మాసం నుంచి తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగులకు సమ్మెకు వెళ్లడం, డిజిసిఎ కూడా కెఎఫ్‌ఎ లైసెన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సేవలను తిరిగి పునరుద్దణ చేసేందుకు తమకు అనుమతివ్వాలని ఆ కంపెనీ సీఈవో సంజయ్ అగర్వాల్ డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)ను కలిసి మరో సారి కోరినట్లు సమాచారం. ఐతే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ తమకు చెల్లించాల్సిన రూ. 390 కోట్ల పన్నులు చెల్లించాకే తిరిగి ఆ కంపెనీ విమానాలు గగణతలంలోకి ఎగరడానికి అనుమతిస్తామని ఎఎఐ ఛైర్మన్ విపి అగర్వాల్ స్పష్టం చేశారు.
కింగ్‌ఫిషర్ ఇది వరకు తమకు కొన్ని చెక్కులు అందించిందని, అయితే ఇందులో రూ.117 కోట్ల విలువైన చెక్కులు చెల్లుబాటు కాలేదని పేర్కొన్నారు. మిగితా పన్ను బకాయిలకు అసలు గ్యారంటీనే లేదని పేర్కొన్నారు. ఇచ్చిన బ్యాంకు చెక్కులు బౌన్స్ కావడంపై న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. పన్నులు చెల్లించనందుకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాలను సీజ్ చేయడానికి గాను విమానయానశాఖ కార్యదర్శితో భేటీ కానున్నట్లు తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు, రూ. 2,000 కోట్లకుపైగా నష్టాల్లో కొనసాగుతుంది.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications