భారత్, బ్రిటన్‌ల మధ్య వ్యాపార సంబంధాలు మరింత పటిష్ఠం కావాలి: డెవిడ్ కామెరూన్

ముంబై: విదేశీ పర్యటనలో ఉన్న బ్రటిన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ భారత వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు కొన్ని అనుకూల ప్రకటనలు చేశారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్తలు బ్రిటన్‌లో గనుక వ్యాపారాలను విస్తరిస్తే.. వెంటనే వీసాలు జారీ చేయడం.. బ్రిటన్‌లో ఉన్నత చదువులు చదువుకోవాలన్న విద్యార్థులకు ఇంత వరకు విద్యార్థులను పరిమితంగా అనుమతించే వారు ఇక నుంచి అలాంటి నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున వీసాల జారీ ప్రక్రియను ఇక్కడినుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తక్షణమే వీసాలు అందజేస్తామని కెమరాన్‌ ఇక్కడ తాజ్‌హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో భారత పారిశ్రామిక వేత్తలతో చెప్పారు.

తాజ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత పారిశ్రామికవేత్తలైన రతన్ టాటా, ముకేశ్ అంబానీ, చందా కొచ్చర్, ఆది గోద్రెజ్, నైనా లాల్ కిద్వాయ్, జస్పాల్ బింద్రా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు బ్రిటన్‌కు వచ్చి తమకు ఇష్టం వచ్చిన విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఉత్తీర్ణులైన తర్వాత గ్రాడ్యుయేషన్‌ స్థాయి ఉద్యోగాలు చేసుకోవచ్చునని కెమరాన్‌ అన్నారు. బ్రిటన్‌లో మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాస్తుమని.. ఇప్పటికి కూడా భారత్‌లో పలు నియమ నిబంధనలున్నాయని, వీటిల్లో మార్పుల్లో చేర్పులు చేస్తే భారత్ మరింతగా దూసుకుపోతుందని, మరిన్ని ఉద్యోగాలు వస్తాయని, మరింత సంపద వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

UK PM's visit: David Cameron woos India, wants special ties

బ్రిటిష్‌ కంపెనీలకు భారత్‌లో బ్యాంకింగ్‌, రీటెయిల్‌ రంగంలో వ్యాపారాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. అలాగే భారతీయ కంపెనీలకు బ్రిటన్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. ఒక భారత కంపెనీ జాగ్వార్, ల్యాండ్‌రోవర్‌లను తయారు చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానని అన్నారు. ఈ రెండు బ్రాండ్లను టాటా మోటార్స్ టేకోవర్ చేయడం ప్రపంచానికి విస్మయాన్ని గురి చేసిందని తెలిపారు. భారత బ్యాంకింగ్, బీమా రంగాల్లో మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని కోరారు. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని భారత్‌ - బ్రిటన్‌ భాగస్వామ్యంలో రెండు దేశాలు ఆర్థికంగా ఎదగాలని ఆయన చెప్పారు.

ఇక భారత్, బ్రిటన్‌ల మధ్య వ్యాపార బంధాలు మరింతగా బలపడాలని, ఇది ఇరుదేశాలకే కాకుండా ఆఫ్రికా, ఆసియా దేశాలకూ మేలు చేస్తుందని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా చెప్పారు. టాటా గ్రూప్ ఇంగ్లాడులో భారీ ఉక్కు పరిశ్రమ అయిన కోరస్‌ను కొనుగోలు చేయడంతో పాటు, అక్కడ జాగార్, ల్యాండ్ రోవర్ కారు బ్రాండ్లను విక్రయిస్తూ కార్ల ఉత్పత్తి చేసే భారీ కంపెనీగా అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. బ్రిటన్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, బ్రిటన్‌లో తమ అనుభవాలు మరవలేనివని రతన్ టాటా చెప్పారు. కాగా ఐరోపాలో ఆర్థిక మాంద్యం ఉన్నందున స్టీల్ పరిశ్రమ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని ఆయన వెల్లడించారు.

కాగా, భారత మౌలిక, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి బ్రిటన్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ ఆది గోద్రేజ్ చెప్పారు. ఈ సమావేశంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్, ఆసియా ప్రాంత సిఇవో జస్పాల్ బింద్రా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కొనియాడారు. జీఎస్‌టీని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని, జీఎస్‌టీ కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుందని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ కంట్రీ హెడ్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+