
దీనితోపాటు డెక్కన్ క్రానికల్ హోల్టింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తనఖాలో ఉంచిన కొన్ని షేర్లను.. రుణాలిచ్చిన సంస్థలు స్వాధీనం చేసుకోవడంతో డిసెంబరు ఆఖరు నాటికి కంపెనీలో ప్రమోటర్ల వాటా 32.66 శాతానికి తగ్గిపోయింది. అదే సెప్టెంబర్‌లో 38.40 శాతంగా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్దకు అప్పు ఇచ్చిన రుణ దాతలు తమ సొమ్మును తిరిగి వెనక్కి తీసుకునే నిమిత్తం డెక్కన్ యాజమాన్యంపై పుల చోట్ల న్యాయస్దానాలు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లను ఆశ్రయించారు. రుణాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చలు జరుపుతున్నందున వడ్డీ బకాయిలు, ఇతర ఆర్థికపరమైన చెల్లింపులకు సంబంధించి ప్రొవిజనింగ్ చేయలేదని డీసీహెచ్‌ఎల్ పేర్కొంది.
ఐపీఎల్ జట్టును ఏకపక్షంగా రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై నష్టపరిహారాన్ని కోరుతూ బొంబే హైకోర్టును ఆశ్రయించామని, ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ వైస్ చైర్మన్ పి.కె. అయ్యర్ తెలిపారు. ఇటీవలే డెక్కన్ క్రానికల్‌కు చెందిన నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లైన ఎం సుకుమార్‌రెడ్డి, జీ కుమార్, వి సురేష్, పి సిద్దార్ద్‌లు బోర్డుకు రాజీనామాలను ఆమోదించినట్లు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీ) బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కి వెల్లడించింది. కాగా, డిసెంబర్ 8న సమావేశమైన బోర్డు వి లక్ష్మణాచార్య, మలపాక వెంకటేశ్వర్లు, ఎస్ సురేష్‌లను అదనపు డెరైక్టర్లుగా నియమించినట్లు వివరించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications