ముంబై: దేశంలో కార్ల అమ్మకాలు మందగించడంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర లాభంలో 52.2 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 1,636.01 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు టాటా మోటార్స్ తన నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ 3,422.7 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 46,089 కోట్ల రూపాయలు రాగా, గత సంవత్సరం ఈ త్రైమాసికంలో 45,260.25 కోట్ల రూపాయలు సాధించింది. మార్కెట్‌లో నెలకొన్న మాంద్యం పరిస్థితుల వల్ల నికర లాభం క్షీణించినట్లు కంపెనీ వెల్లడించింది.
కంపెనీ ఏకీకృత నికర నష్టం 458.49 కోట్ల రూపాయలుండగా, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం 173.67 కోట్ల రూపాయలు వచ్చినట్లు కంపెనీ తెలియచేసింది. ఇక కంపెనీ గత సంవత్సరం ఆదాయం 13,337.9 కోట్ల రూపాయలుండగా ఈ ఏడాది త్రైమాసికంలో 10,630.09 కోట్ల రూపాయలు లభించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. జాగ్వార్ ల్యాండ్‌రోవర్ అమ్మకాలు పెరగడంతో ఆదాయాల్లో అభివృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.
ఈ కాలంలో మొత్తం జాగ్వార్ ల్యాండ్‌రోవర్ విక్రయాలు 10% పెరిగి 94,828 యూనిట్లను వరకు అమ్ముడయ్యాయి. వీటిలో జాగ్వార్ వాహనాలు అమ్మకాలు 15,043 కాగా, 79,785 ల్యాండ్ రోవర్లను విక్రయించింది. ఈ వాహనాలకు చైనా నుంచి భారీ డిమాండ్ లభిస్తున్నదని కంపెనీ తెలిపింది. జేఎల్‌ఆర్ ఆదాయాలు 1.5% పెరిగి 380.4 కోట్ల పౌండ్లకు (జీబీపీ) చేరగా, నికర లాభం 39.3 కోట్ల పౌండ్ల నుంచి 29.6 కోట్ల పౌండ్లకు తగ్గింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
టాటా మోటార్స్ క్యూ3: 52 శాతం క్షీణించిన నికర లాభం | Maruti, Tata Motors drag auto index lower | 52 శాతం క్షీణించిన టాటా మోటార్స్ నికర లాభం
Maruti and Tata Motors dropped sharply for the second day in a row, affecting sentiments for auto and ancillary stocks.
Story first published: Friday, February 15, 2013, 14:50 [IST]
Other articles published on
Feb 15, 2013