ముంబై: దేశంలో మరో కొత్త స్టాక్ ఎక్సేంజ్ ఈరోజు నుండి పూర్తిస్దాయిలో మొదలుకానుంది. షేర్లు, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో లావాదేవీలను ఎమ్‌సీఎక్స్ స్టాక్ ఎక్సేంజ్ (ఎస్ఎక్స్) ప్రారంభిస్తోంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల తర్వాత దేశంలో మూడో పూర్తి స్దాయి ఈక్విటీ ఎక్సేంజ్ ఎమ్‌సీఎక్స్ స్టాక్ ఎక్సేంజ్ (ఎస్ఎక్స్). ఎమ్‌సీఎక్స్ స్టాక్ ఎక్సేంజ్ (ఎస్ఎక్స్)ని శవివారం ఆర్దిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు.
ఎమ్‌సీఎక్స్-ఎస్ఎక్స్‌లో 40 షేర్ల సూచీ ఉంటుంది. దీనిని ఎస్ఎక్స్40గా పిలుస్తారు. వివిధ రంగాలకు చెందిన భారీ మూలధన విలువ కలిగిన షేర్లతో పాటు అధికంగా చలామణి అయ్యే షేర్లతో ఎస్ఎక్స్ 40 కూడుకోని ఉంటుంది. ఎమ్‌సీఎక్స్-ఎస్ఎక్స్ వైస్ ఛైర్మన్ జిగ్నేశ్ షా మాట్లాడుతూ 40 షేర్లతో కూడిన ‘ఎస్‌ఎక్స్-40' ఇండెక్స్... ఫ్రీ-ఫ్లోట్(మార్కెట్లో ఇన్వెస్టర్ల దగ్గరున్న షేర్లు) ఆధారంగా, లార్జ్ క్యాప్, లిక్విడ్ స్టాక్స్, ప్రధాన రంగాలను సూచించేలా ఉంటుందన్నారు. ఇక ఎస్‌ఎక్స్-40 సూచీ విలువ 10,000గా ఉంటుం దని, 2010 మార్చి 31 బేస్ తేదీ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
క్యాపిటల్ మార్కెట్ విభాగంలో ప్రారంభ స్థాయిలో 1,116 కంపెనీల ఈక్విటీ షేర్లనే టేడింగ్‌కు అనుమతిస్తున్నారని జిగ్నేశ్ షా పేర్కొన్నారు. రుణ పత్రాలు, వడ్డీరేట్ల డెరివేటివ్స్, కరెన్సీ, ఎస్‌ఎంఈ మార్కెట్లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నేటి నుండి పూర్తిస్దాయి ట్రేడింగ్ | MCX-SX goes live with equity, derivative trading with SX40 index | 'ఎంసీఎక్స్ స్టాక్' ఎక్స్చేంజ్‌లో పూర్తిస్దాయి ట్రేడింగ్
MCX Stock Exchange (MCX-SX) will begin live trading in equities and equity derivatives from Today. SX40 will be a free-float based index of large-cap and liquid stocks, representing diverse sectors. The base value will be 10,000 with a base date of March 31, 2010, MCX-SX Vice-chairman Jignesh Shah said at the launch.
Story first published: Monday, February 11, 2013, 11:15 [IST]
Other articles published on
Feb 11, 2013