నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు ఎన్నికైన రతన్ టాటా

ఈ అకాడమీలో సభ్యులుగా కొత్తగా 69 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. అందులో 8 మంది భారతీయ అమెరికన్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ అకాడమీలో సభ్యులుగా ఎంపిక అవ్వడమంటే.. ఇంజనీరింగ్‌లో విద్య, పరిశోధన, అభివృద్ధి, కీలక మార్పులు తీసుకురావడంలో విశేష కృషికి గుర్తింపుగా భావిస్తారు. అకాడమీకి ఎన్నికైన వారిలో పీజేఎమ్ ఇంటర్ కనెక్షన్ సీనియర్ కన్సల్టెంట్ మూర్తి భావరాజు, ఈడీఎక్స్ ప్రెసిడెంట్, మసాచు సెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆచార్యుడు అనంత్ అగర్వాల్, లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీ డైరెక్టర్ అశోక్ గాడ్గిల్, డో కెమికల్ కో పరిశోధన - డెవలప్ మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గణేశ్ కైలాసం తదితరులు ఉన్నారు.
డిసెంబర్ 28న టాటా గ్రూప్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన మాజీ ఛైర్మన్ రతన్ టాటా తన రిటైర్ జీవితం చాలా హాయిగా ఉందన్నారు. 75 ఏళ్ల వయసు కలిగిన రతన్ టాటా రిటైర్మెంట్ తర్వాతి జీవితం అద్భుతంగా ఉందని, ఆహ్లాదకరమైన జీవితాన్ని మనసారా ఆస్వాదిస్తున్నానని ‘లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్' పేరిట ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఇంట్లోనే నేనిప్పుడు ఎక్కువగా ఉంటున్నాను. నా కుక్కలతో ఆడుకుంటున్నాను. సమయం లేక ఇంతకుముందు ఆస్వాదించలేని చిన్నచిన్న సంతోషాలను ఇప్పుడు ఆస్వాదిస్తున్నాను' అని ఈ ట్విట్టర్ పోస్ట్‌లో తన ఫాలోవర్స్‌కి తెలియజేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications