
ఆగస్టు 31వ తేదీన తాను ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సహారా ఇండియాకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (సైరెక్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (షిక్) ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనందుకు సెబీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు జడ్జి మీకు ఏమీ చేయాలో స్పష్టంగా చెప్పినా మీరు ఎందుకు చేయడంలేదని బెంచి న్యాయమూర్తులు కె ఎస్ రాధాకృష్ణన్, జె ఎస్ శేఖర్‌లు సెబిపై ప్రశ్నించారు. సెబీ దీనికి తాము ఏఏ చర్యలు తీసుకున్నామో ఒక నివేదికను కోర్టుకు అందజేశారు.
కంపెనీలకు నోటీసులు జారీ చేశామని, బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసి, ఆస్తులను జప్తు చేయడానికి బాంబే సివిల్ కోర్టును ఆశ్రయించామని సెబీ వివరణ ఇచ్చింది. అయితే సెబీ వివరణ పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంతృప్తి చెందలేదు. నోటీసులతో పనికాదని గత ఏడాది ఇచ్చిన ఆర్డర్‌ను ఖచ్చితంగా పాటించాలని కోర్డు ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో మూడు నెలల్లో చెల్లించాలని ఆగస్టు 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో డబ్బు వసూలు చేసి డిపాజిటర్లకు చెల్లించాలని ఆదేశించింది.
ఇక సహారా కంపెనీల తరపు సీనియర్ న్యాయవాది రాంజఠ్మలాని కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికి ఇప్పుడు రూ.10,000 వేల కోట్లు డిపాజిట్ చెయ్యడం కంపెనీకి ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. సైరెక్, ఫిక్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు సెబీ దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తొమ్మిది వారాల్లోగా పెట్టుబడిదారుల సొమ్మును వాపసు చెయ్యాలని కోర్టు ఇంతకుముందు సహారా కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే. సెబీకి తక్షణం రూ. 5,120 కోట్ల మేరకు డిమాండ్ డ్రాఫ్ట్ అందజేయాలని సహార కంపెనీలను ఆదేశించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications