డిసెంబర్ క్యూ3: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నష్టాలు రూ. 755 కోట్లు

Kingfisher Airlines
Kingfisher Airlines: Quotes, News
BSE 1.3600000143051147BSE Quote0 (0.00%)
NSE 1.2999999523162842NSE Quote0 (0.00%)
ముంబై: విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్ద మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇటీవల కాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 755 కోట్ల నష్టాలకు చేరింది. గతయేడాది డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 444.26 కోట్ల లాభాలను ఆర్జించింది. గతయేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,367.71 కోట్ల రెవిన్యూని పొందిన గ్రౌండెడ్ ఎయిర్‌లైన్ ఈ ఏడాది ఎటువంటి రెవిన్యూని పొందలేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీకి చెందిన ఆడిటర్స్ బికె రమద్యని అండ్ కో తెలిపింది.

ఇటీవలే రుణ సంక్షోభంలో చిక్కుకున్న విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీని మూసివేయాలని కోరుతూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు న్యాయస్దానాన్ని ఆశ్రయించనున్నారు. ఎనిమిది నెలల్లో తమ వేతన బకాయిలను చెల్లించే భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు రాకపోతే కింగ్‌ఫిషర్‌ను మూసివేయాలని కోరుతూ న్యాయస్దానాన్ని ఆశ్రయించాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. తమ భవిష్యత్ కార్యచరణను వివరించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని కలవడంతో పాటు.. అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్నారు. కింగ్‌ఫిషర్ పునరుద్దరణ ప్రణాళికను వివరాలతో మాతో పంచుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాం. జీతాల బకాయిలను దశల వారీగా చెల్లించే ప్రణాళికను కూడా వెల్లడించాలి.

యాజమాన్యం సమాధానం మాకు సంతృప్తిని ఇవ్వకపోతే, కంపెనీల చట్టంలోని 433 సెక్షన్ క్రింద న్యాయస్దానంలో కంపెనీని మాసియాలంటూ పిటీషన్ దాఖలు చేస్తాం అంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఫ్లయింగ్ లైసెన్స్ గడువు ఇటీవల ముగిసినప్పటికీ.. రెండేళ్లలోగా ఈ లైసెన్స్‌ను పునరుద్దరించుకునే అవకాశం ఉంది. లైసెన్స్ గడువు ముగియడంతో, తిరిగి లైసెన్స్ పునరుద్దరించడానికి ఎక్కువ సమయం పడుతుందని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు మరింత లేట్ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ మాత్రం గడువు ముగిసిన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కోంది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2003, ఆగస్టు 26న ఎయిర్ డెక్కన్ కంపెనీ నుండి లైసెన్స్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌డెక్కన్‌ను ఆ తర్వాత యూబీ గ్రూప్ కొనుగోలు చేసి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌ఫిషర్ ఉద్యోగులు సమ్మెకు దిగడం, కంపెనీ లాకౌట్ ప్రకటించడం, తదితర పరిణామాలనంతరం 2012 అక్టోబర్ 20న ఆ కంపెనీ ఫ్లయింగ్ లెసైన్స్‌ను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఈవో పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు సమర్పించారు. కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు సమకూర్చుకునే విషయమై మరింత స్పష్టత కావాలంటూ డీజీసీఏ కింగ్‌ఫిషర్‌ను కోరింది.

కింగ్‌ఫిషర్ లెసైన్స్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నామని డీజీసీఏ వర్గాలు తాజాగా వెల్లడించాయి. గత వారమే తాము లెసైన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేశామని, విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించడానికి సంబంధించిన పునరుద్ధరణ ప్రణాళికను కూడా సమర్పించామని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. కింగ్‌ఫిషర్ ఫ్లయింగ్ లెసైన్సు గడువు ఇప్పటికే ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీకి రూ. 7,000 కోట్ల మేర రుణభారం, రూ. 8,000 కోట్ల నష్టాలు ఉన్నాయి.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+