పుంజుకుంటున్న రూపాయి.. 30 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ఈరోజు మార్కెట్‌లో సూచీ ఆధారిత కంపెనీలలో టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్, డీఎల్ఎఫ్‌లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 7 శాతానికి పైగా, ఐడీఎఫ్‌సీ, జయప్రకాశ్ అసోసియేట్స్, రాన్ బాక్సీ, భెల్ కంపెనీలు రెండు శాతానికి పైగా నష్టపోయాయి.
ఇది ఇలా ఉంటే వరుసగా నాలుగు వారాల పాటు లాభపడిన రూపాయి ఐదోవారం కూడా లాభాలతోనే మొదలయింది. ప్రస్తుతం 53ను అధిగమించే పైకి వచ్చింది. ఇది మూడున్నర నెలల గరిష్ఠ స్థాయి. స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) జనవరి నెలలో రూ. 22,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. వరుసగా గత 7 నెలల నుండి ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున పెట్టబడులు పెడుతూనే ఉన్నారు. ఎఫ్‌ఐఐలు గత నెల గరిష్ఠంగా మార్కెట్ నుంచి రూ. 77,859 కోట్ల షేర్లు కొనుగోలు చేసి రూ. 55,800 కోట్ల షేర్లు విక్రయించారు. దీంతో నికరంగా వారి పెట్టుబడి రూ. 22,059 కోట్లుగా తేలింది. ఎఫ్‌డీఐఐలు భారీగా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రావడంతో రూపాయి బలపడుతోంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications