ముంబై: స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) జనవరి నెలలో రూ. 22,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. వరుసగా గత 7 నెలల నుండి ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున పెట్టబడులు పెడుతూనే ఉన్నారు. ఎఫ్‌ఐఐలు గత నెల గరిష్ఠంగా మార్కెట్ నుంచి రూ. 77,859 కోట్ల షేర్లు కొనుగోలు చేసి రూ. 55,800 కోట్ల షేర్లు విక్రయించారు. దీంతో నికరంగా వారి పెట్టుబడి రూ. 22,059 కోట్లుగా తేలింది.
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టే గార్ అమలును 2016 ఏప్రిల్ వరకూ వాయిదా వేయడం, డీజిల్ ధరలపై కొంతమేర నియంత్రణలు ఎత్తివేయడం వంటి అంశాలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయంటూ విశ్లేషించారు. మరోవైపు ఫిస్కల్ క్లిఫ్ బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించడం కూడా విదేశీ పెట్టుబడుల రాకకు కారణమైందని తెలిపారు.
ఇటీవల కాలంలో టాటా గ్రూప్ కంపెనీల పట్ల ఎఫ్ఐఐలు ఎక్కువగా ఆసక్తిని కనబర్చారు. వివరాల్లోకి వెళితే టీసీఎస్‌లో ఎఫ్‌ఐఐల వాటా 14.83% నుంచి 14.96%కు పుంజుకోగా, టాటా మోటార్స్‌లో 28.47% నుంచి 29.01%కు పెరిగింది. టాటా పవర్, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, టాటా ఎలక్సీ, టాటా గ్లోబల్ బెవరేజెస్, ఇండియన్ హోటల్స్‌లోనూ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు పెరిగాయి.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
జనవరి నెలలో ఎఫ్ఐఐల నికర పెట్టుబడి రూ. 22, 000 కోట్లు | FIIs invest Rs 22,000 cr into Indian equities in Jan | ఎఫ్ఐఐల నికర పెట్టుబడి రూ. 22, 000 కోట్లు
Foreign Institutional Investors ( FIIs) were gross buyers of shares worth Rs 77,859 crore, while they sold equities amounting to Rs 55,800 crore translating into a net inflow of Rs 22,059 crore ($4.05 billion), according to Sebi data.
Story first published: Monday, February 4, 2013, 15:22 [IST]
Other articles published on
Feb 4, 2013