For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి నెల డీజిల్ ధర లీటర్‌కు 40 నుండి 50 పైసలు పెరుగుతుంది: మెుయిలీ

By Nageswara Rao
|

Diesel prices to be hiked 40-50 paise every month
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు సబ్సిడీ ద్వారా నష్టపోయిన మొత్తాన్ని భర్తీ చేసుకునే వరకు ఇకపై ప్రతి నెల డీజిల్ ధర లీటర్‌కు 40 నుండి 50 పైసలు పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం. వీరప్ప మెుయిలీ తెలిపారు. ప్రస్తుతం ఒక లీటర్‌ డీజిల్‌ను రూ. 10.80 నష్టానికి విక్రయిస్తున్నామన్నారు. దీంతో ఆయిల్‌ సంస్థలు డీజిల్‌ ధరలను డీ రెగ్యులేట్‌ చేయాలని లేదా రాష్ట్రాల నియంత్రణ నుంచి విముక్తి కల్గించాలని జనవరి 17వ తేదీన సర్కార్‌ నిర్ణయించింది. జనవరి 17న ఆయిల్‌ సంస్థలు డీజిల్‌ ధర లీటర్‌కు 45 పైసలు పెంచింది. భారీ మొత్తాలలో డీజిల్‌ను కొనుగోలు చేసే రక్షణ, రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలకు సరఫరా చేసే డీజిల్ ధరను లీటరకు 10 రూపాయల వంతున చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వార్షిక సబ్సిడీ దాదాపు 12,907 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా.

ఆయిల్‌ సంస్థలు డీజిల్‌ ధరలను రెండో సారి ఎప్పుడు పెంచుతాయన్నది తాను చెప్పలేనని అన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలకు ఉపయోగించే డీజిల్‌ను ఆయిల్‌ సంస్థల నుంచి కొనుగోలు చేసే కన్నా బయటి పెట్రోల్‌ బంకుల నుంచి కొనుగోలు చేయడం మేలని గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు అనుకుంటున్నట్లు తనకు తెలిసిందని మొయిలీ చెప్పారు. ఈ విషయమై తాము దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ను కొనుగోలు చేయాలనే దాని కన్నా.. డీజిల్‌పై రాష్ట్రంలో విధించే స్థానిక సేల్స్‌ టాక్స్‌ లేదా వ్యాట్‌ను తగ్గించుకోవాలని మొయిలీ సూచించారు.

తెలుగు వన్ఇండియా

English summary

ప్రతి నెల డీజిల్ ధర లీటర్‌కు 40 నుండి 50 పైసలు పెరుగుతుంది: మెుయిలీ | Moily: Diesel prices to be hiked 40-50 paise every month | ప్రతి నెల డీజిల్ ధర లీటర్‌కు 40 నుండి 50 పైసలు పెరుగుతుంది

Diesel prices will be hiked by 40-50 paise per litre every month till losses on the nation's most used fuel are completely wiped out, oil minister M Veerappa Moily said today.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X