సంస్కరణల తీరుని బట్టి భారత రేటింగ్స్ డౌన్‌గ్రేడింగ్ ఆధారపడి ఉంటుంది: ఫిచ్

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో భారత్ ఆర్దిక వ్యవస్థ వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన 6.5 శాతం బదులు 6 శాతం మేరకు మాత్రమే ఉంటుందని తాజాగా రేటింగ్స్ దిగ్గజం 'ఫిచ్' సూచించింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి ఈ ఏడాది(2012-13)లో 6 శాతానికి తగ్గిపోవచ్చునని... అంతక్రితం అంచనా వేసిన 6.5% నుండి 6 శాతానికి కుదించడమైందని, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ప్రతికూలంగా అత్యంత సవాళ్లతో కూడుకొని ఉండటమే అంచనాలు తగ్గించేందుకు ప్రధాన కారణమని ‘గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్' నివేదికలో ఫిచ్ వెల్లడించింది.
భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠ స్థాయికి 5.3 శాతానికి మందగించింది. వృద్ధి రేటు 2011-12 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి పడిపోయింది. దేశంలో ప్రతికూల రాజకీయ వాతావరణం వల్ల ప్రభుత్వం ఈ నెల ప్రథ మార్ధంలో ప్రకటించిన వివిధ సంస్కరణల అమలు కష్టం కావచ్చునని కూడా ఫిచ్ హెచ్చరించింది. ‘ప్రతికూల రాజకీయ వాతావరణం వల్ల అమలు కష్టమయ్యే సూచనలు ఉన్నప్పటికీ అధికారులు మల్టీ రీటైల్ రంగంలో ఎఫ్‌డిఐ అనుమతితో సహా వివిధ సంస్కరణలను ప్రకటించారు. ఆ సంస్కరణల వల్ల మదుపరులలో విశ్వాసం తిరిగి నెలకొని, పెట్టుబడులు పెరగవచ్చు' అని ఫిచ్ పేర్కొన్నది.
బహుళ బ్రాండ్‌ల రీటైల్ వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)కి అవకాశాలు కల్పించడమే కాకుండా విమానయాన సంస్థ లలో వాటాల కొనుగోలుకు విదేశీ విమానయాన సంస్థ లను ప్రభుత్వం ఇంత కుముందు అనుమతించిన విషయం విదితమే. డీజెల్ ధరలను లీటర్‌కు రూ. 5కు పైగా ప్రభుత్వం పెంచి, సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ల సంఖ్యను కుటుంబానికి సంవత్సరానికి ఆరుకు పరిమితం చేసింది. ‘ప్రభుత్వం దీర్ఘ కాల నిరీక్షణ అనంతరం ఈ నెల మధ్యలో డీజెల్ ధరలను 12 శాతం మేరకు పెంచాలని నిర్ణయించిన దృష్ట్యా ద్రవ్యోల్బణపరమైన ఒత్తిడి కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది' అని ఫిచ్ తెలిపింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications