ఉచిత చెక్‌బుక్‌లపై పరిమితి.. డ్రా చేసినా, డిపాజిట్ చేసినా బ్యాంక్ చార్జీలు: ఆర్‌బీఐ

అలాగే బ్యాంకులు జారీ చేసే ఉచిత చెక్‌బుక్‌లపై పరిమితిని పాటించాలని, చెక్‌బుక్‌ల జారీకి హెచ్చు మొత్తాలలో వినియోగదారుల నుంచి ఫీజు వసూలు చేయాలని, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు ఆన్‌లైన్‌లో విధిగా చేయాలని, పోస్టుడేటెడ్ చెక్కులు (పిడిసి)లపై నిషేధం విధించాలని సూచించింది. ఈ సూచనలపై ప్రజాభిప్రాయసేకరణకు గడువు ఫిబ్రవరి 28 లోగా తెలపాల్సి ఉంది. యుటిలిటీ బిల్లులను (కరెంటు బిల్లు, ఆస్తిపన్ను మొదలైనవి) ఆన్‌లైన్లో కట్టడంపై ప్రభుత్వం కన్వీనియన్స్ చార్జీలు విధించడం ఎత్తివేయాలని ఆర్‌బీఐ పేర్కొంది.
దేశంలో చెక్కుల ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఉందని... దీన్ని తగ్గించేందకు ఎలక్ట్రానిక్ పద్ధతిని అవలంబించాలని ఆర్‌బీఐ తన చర్చాపత్రంలో పేర్కొంది. చెక్కుల వినియోగం తగ్గించేందుకు ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆన్‌లైన్‌లో చెల్లింపుల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వారికి వివరించాల్సి ఉంటుంది. ఇక నుంచి ఉచిత చెక్కు బుక్‌లను వీలైనంత వరకు తక్కువ చేయాలని... అదనంగా చెక్కులు కావాలనుకునే వారి నుంచి అదనంగా రుసుము వసూలు చేయాలని చర్చాపత్రంలో సూచించింది. కస్టమర్ ఎంత మేరకు చెక్కులు వినియోగిస్తున్నారో చూసి దాని ప్రకారం చార్జీలు వసూలు చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది.
దీనితో పాటు మొండి బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో కొత్తగా పునర్‌వ్యవస్థీకరించిన రుణాలకు ప్రొవిజనింగ్‌ను ఆర్‌బీఐ ప్రస్తుత 2.75 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. దశలవారీగా పెరుగుతూ పోయే ఈ ప్రొవిజనింగ్ 2015 ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో 5 శాతంగా అమల్లోకి వస్తుంది. అలాగే, రీస్ట్రక్చర్ చేసిన రుణాలకు కార్పొరేట్ గ్యారంటీ కాకుండా ప్రమోటర్ల వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications