
మొత్తం మీద క్యూ3లో కన్సాలిడేటెడ్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 1,718 కోట్ల నుంచి రూ. 1,940 కోట్లకు పెరిగిందని చెప్పారు. డాలర్ల రూపంలో చూస్తే ఆదాయం 9.6 శాతం పెరిగి 356 మిలియన్ డాలర్లుగాను, లాభం 15 మిలియన్ డాలర్లుగానమోదైంది. అబర్డీన్ వివాదం ముగియడంతో విదేశాల్లో కేసులన్నీ కూడా పరిష్కారమైపోయాయని నయ్యర్ తెలిపారు.
ఇక కంపెనీ సీఈవో గుర్నానీ మాట్లాడుతూ సాధారణంగా Q3లో పరిస్దితులు బలహీనంగా ఉన్నప్పటికీ.. స్దిరమైన వృద్దిని సాధించామన్నారు. యూరోపియన్ యూనియన్ 22 శాతం, మిగిత దేశాలు 25 శాతం వాటా వ్యాపారాన్ని అందించాయని పేర్కొంది. మరోవైపు, టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనంపై కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడే సంస్థలో ముందుగా టెలికం, తర్వాత తయారీ, బ్యాంకింగ్ సర్వీసుల విభాగాలకు ప్రాధాన్యం ఉంటుందని గుర్నానీ చెప్పారు.
ఇక కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ. 3,062 కోట్ల నుంచి రూ. 3,311 కోట్లకు పెరిగాయి. క్యూ3లో మార్జిన్లను నిలబెట్టుకోగలిగామని, రూపాయి కాస్త స్థిరంగా ఉండటంతో విదేశీ మారకం రూపంలో రూ. 29 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని మహీంద్రా సత్యం సీఎఫ్‌వో వసంత్ కృష్ణన్ తెలిపారు. కంపెనీ మొత్తం క్లయింట్ల సంఖ్య 368కి చేరిందన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications