రెండు వారాల్లో కొత్త బ్యాంకు లైసెన్సు నిబంధనలు: ఆర్దిక మంత్రి

P Chidambaram
న్యూఢిల్లీ: కొత్త ప్రైవేట్ బ్యాంకుల లెసైన్సుల జారీకి సంబంధించి విధివిధానాలను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరో రెండు వారాల్లో విడుదల చేయగలదని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. త్వరలోనే ప్రయివేట్‌ రంగానికి చెందిన నాలుగు ఐదు సంస్థలకు లైసె న్సులు మంజూరు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు నుంచి రెండు వారాల్లో రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త బ్యాంకుల లైసెన్సుల విధివిధానా లను విడుదల చేస్తుందని... త్వరలోనే తన అంచనా ప్రకారం నాలుగు నుంచి ఐదు ప్రైవేట్‌ సంస్థలకు బ్యాంకు లైసెన్సులు కూడా మంజూరవుతాయని ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం చెప్పారు.

అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్, ఎల్‌అండ్‌టీ గ్రూప్, ఆదిత్య గ్రూప్ తదితర దిగ్గజ సంస్థలు బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో 26 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ప్రైవేట్ బ్యాంకులు, 40 విదేశీ బ్యాంకులు ఉన్నాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించడాన్ని స్వాగతించిన చిదంబరం.. ఇక వృద్ధికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు హద్దులుండడమే కాక, బాధ్యతాయుతంగా ఉంటుందని చిదంబరం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును .. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 5.3 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరం 4.8 శాతానికి పరిమితం చేయాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ పరిమితిని ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘించే ప్రసక్తే లేదన్నారు. ఇంధన సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసే అవకాశం లేదని చిదంబరం చెప్పారు. కానీ డీజిల్ ధరలను సవరించడంతో పాటు కాలానుగుణంగా ధరల సవరణకు చమురు కంపెనీలకు అంగీకారం తెలిపింది. డీజిల్ ధర 10 రూపాయల వరకు సవరించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల చర్యలు చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు సరైనవని ప్రభుత్వం భావిస్తోంది' అని ఆయన అన్నారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+