
ప్రస్తుతం అమలులో వున్న పన్ను రేట్లు 1997లో తానే సమర్పించిన బడ్జెట్‌లో రూపొందించిన పన్ను రేట్లు తరువాత నాలుగు ప్రభుత్వాలు, నలుగురు ఆర్థిక మంత్రులు మారినా అదే స్థాయిలో వున్నాయన్నారు. స్థిరమైన పన్ను రేట్లను తాను విశ్వసిస్తానని చెప్పారు. వచ్చే నెల 28న తాను బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి ద్రవ్యలోటును ప్రభుత్వం 5.3 శాతం లోపు వుంచగలగటంతో పాటు, వచ్చే బడ్జెట్‌లో దానిని 4.8 శాతానికి తగ్గించేందుకు హామీ ఇస్తే అప్పుడు వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు.
దేశంలోని సంపన్నులపై పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేయడం అనేది మంచిపనే అయినప్పటికీ.... ఫ్రీ-బ్రడ్జెట్‌కు ముందు చిదంబరం ఆర్థికవేత్తలతో జరిపే సంప్రదింపుల్లో జరిపినప్నుడు ఈ ప్రతిపాదనను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రెవెన్యూను పెంచుకోవాలంటే పన్నుల పరిధిని మరింత పెంచుకోవాలి కానీ.. సంపన్నులపై పెద్ద ఎత్తున పన్నుల విధించడం అనేది సరైన పద్దతి కాదేమోనని వారు ఆర్థికమంత్రికి సూచించారు.
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ సీ రంగరాజన్ మాత్రం దేశంలోని అత్యధిక సంపన్నులపై పన్నుల భారం మోపి స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో పన్ను నిష్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం సంపన్నులు పన్నులు చెల్లించే విషయానికి వస్తే జనాభాలో అతి తక్కువ మంది ఉంటారు. వారి నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేమని ఆర్థిక వేత్తలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశంలో పన్నులు కట్టేవారి సంఖ్య సుమారు 35 మిలియన్‌లు.
వచ్చే నెలలో ప్రవేశపెట్టే 2013-14 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పైనా చిదంబరం మాట్లాడారు. వచ్చే నెలలో తాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రతిపాదనలను ఆయన ప్రస్తావిస్తూ బడ్జెట్‌ను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించటం లేదన్నారు. ఎన్నికలు ఇంకా 14 నెలల దూరంలో వున్నాయని, వచ్చే ఏడాది బడ్జెట్ బాధ్యతాయుతమైన బడ్జెట్‌గా వుంటుందని ఆయన వివరించారు. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాల్లో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ దీనికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఇది ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందనేది అనుమానమేనంటూ ప్రేమ్‌జీ తెలిపారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications