2012-13కి ఎస్‌బీఐ నికరలాభం రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా..!

SBI
State Bank of India: Quotes, News
BSE 979.65BSE Quote8.65 (-0.88%)
NSE 979.25NSE Quote8.8 (-0.90%)
భువనేశ్వర్: ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2012-2013)లో రూ. 14,000 కోట్లు నుండి రూ. 15,000 కోట్ల వరకు నికర లాభం నమోదు కావచ్చని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ ప్రతీప్ చౌధురి తన అభిప్రాయాన్ని చెప్పారు. గతయేడాది ఇదే ఆర్దిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ. 11,700 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఎస్‌బీఐ ఇప్పటికే రూ. 1.66 లక్షల కోట్ల మార్కెట్ విలువతో తన స్దానాన్ని తిరిగి సంపాదించుకొందని, కనీస మూలధన నిష్పత్తి (సీఆర్‌ఆర్) ఈ ఏడాది మార్చికి 11 శాతానికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రాబోయే పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 1 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని అరశాతం తగ్గించాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంకును కోరినట్లు ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి చెప్పారు. దీని వల్ల పెట్టుబడులు, వృద్ధికి ఊతం లభించగలదని ఆయన తెలిపారు. ఈ నెల 29న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో ప్రతీప్ చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు సమీకరించే డిపాజిట్లలో కచ్చితంగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిధుల మొత్తాన్ని సీఆర్‌ఆర్‌గాను, ఆర్‌బీఐ వద్ద నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీని రెపో రేటుగాను వ్యవహరిస్తారు.

ద్రవ్యోల్బణం, ప్రతిష్టంభన కొనసాగనిచ్చిన పక్షంలో అది స్టాగ్‌ఫ్లేషన్‌కి దారితీస్తుందని ఆయన వివరించారు. తయారీ రంగానికి ఊతమివ్వడం, సరఫరాను మెరుగుపర్చడం ద్వారా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయొచ్చని ఆయన చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున ప్రతిష్టంభనను నివారించడానికి వడ్డీ రేట్లను తగ్గించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, భారత్‌లో యూరప్ తరహా సంక్షోభం తలెత్తే అవకాశముందన్నారు.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+