
కంపెనీ లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు జనవరి 23 నుంచి ట్రేడింగ్ నుంచి తప్పిస్తూ ఎన్‌ఎస్‌ఈ నిర్ణయం తీసుకోగా, 500 ఇండెక్స్ నుంచి డీసీహెచ్‌ఎల్‌ను తప్పిస్తూ బీఎస్‌ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2011-12 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నష్టాలు రూ.774 కోట్లకు చేరింది. కాగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.163 కోట్లు ఆదాయాన్ని నమోదు చేసిం ది. 2011-12లో కంపెనీ ఆదాయం రూ.545 కోట్లుకాగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2010-11తో పోల్చుకుంటే 53 శాతం తగ్గుముఖం పట్టింది. ప్రమోటర్ల వాటా 73.83% నుంచి 38.40 శాతానికి తగ్గింది. ఆడిట్ కమిటీ పరిశీలించిన తర్వాత సోమవారం సమావేశమైన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు ఆర్థిక ఫలితాలకు ఆమోద ముద్ర వేసినట్లు డీసీహెచ్‌ఎల్ పేర్కొంది.
కంపెనీ ఆదాయం నష్టాల్లో ఉండడానికి గల కారణాలను విశ్లేషిస్తే పలు ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తెచ్చింది. దానికి వడ్డీలు చెల్లించడంతో ఆదాయానికి గండిపడింది. ఆర్థిక సంస్థలకు సుమారు రూ.538 కోట్లు వడ్డీల రూపంలో లేదా బకాయిలు చెల్లించడానికి వెచ్చింది. కాగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.59 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఐతే కంపెనీ 2011-12 కు చెందిన మిగిలిన రెండు త్రైమాసిక ఫలితా లను ప్రకటించలేదు. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) మాత్రం తాము రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీ అను మతి తీసుకుని ఫలితాలు కాస్తా ఆలస్యంగా విడుదల చేస్తామని అందుకు అనుమతి తీసుకున్నామని తెలిపింది.
ప్రస్తుతం డీసీహెచ్‌ఎల్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.116 కోట్లుగా ఉంది. ఐపీఎల్‌లో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) చెందిన డెక్కన్ ఛార్జర్స్ టీంను ఏకపక్షంగా రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై నష్టపరిహారాన్ని కోరుతూ బాంబేహైకోర్టును ఆశ్రయించామని, ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు అయ్యర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టు ఆర్బిట్రేటర్‌ను నియమించిందన్నారు. ఈ వివాదం నేపధ్యంతో డెక్కన్ ఛార్జర్స్‌కు సంబంధించిన లెక్కలను ఈ అకౌంట్స్‌లో చూపించలేదని అయ్యర్ వెల్లడించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications