కింగ్‌ఫిషర్‌కి విమాన సేవలు పునరుద్దరించే ఉద్దేశం లేదు: ఎస్‌బీఐ ఛైర్మన్

ఇటీవల కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను రుణాలిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కనార్షియం వ్యతిరేకించింది. గత నెలలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు సమర్పించిన పునరుద్దరణ ప్రణాళిక మాదిరే ఈ ప్రణాళిక కూడా ఉందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని కనార్షియంలోని బ్యాంకులు తమ అభిప్రాయాలను తెలిపాయి. ఇంతకంటే మెరుగైన ప్రణాళికను తీర్చిదిద్దాలని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి సూచించాయి. కింగ్‌ఫిషర్‌కు, బ్యాంకులకు శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ పునరుద్దరణపై ఒక అంకీకారానికి రాలేకపోయాయి. ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది కాలంలో రూ. 650 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు అందించాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై ఆ కంపెనీ ఇంజనీర్లు సంస్దను మూసివేయాలని ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిద్దామని నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీలో సమావేశమైన ఇంజనీర్ల సంఘం వచ్చే వారం యాజమాన్యానికి లీగల్ నోటీసు పంపాలని తీర్మానించినట్లు ఇంజనీర్ల సంఘం ప్రముఖ వార్త సంస్ద పీటీఐకి వెల్లడించింది. ఇది ఇలా ఉంటే కంపెనీ ఎక్స్ ఫైలట్స్ వర్గం తమకు 3 వారాల్లో జీతాలు చెల్లించాలంటూ ఇప్పటికే కంపెనీకి లీగల్ నోటీసు పంపింది.
వీరితో పాటు ఉద్యోగులు కూడా పోయిన వారంలో ఎనిమిది నెలల్లో తమ వేతన బకాయిలను చెల్లించే భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు రాకపోతే కింగ్‌ఫిషర్‌ను మూసివేయాలని కోరుతూ న్యాయస్దానాన్ని ఆశ్రయించాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. తమ భవిష్యత్ కార్యచరణను వివరించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని కలవడంతో పాటు.. అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్నారు. కింగ్‌ఫిషర్ పునరుద్దరణ ప్రణాళికను వివరాలతో మాతో పంచుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాం. జీతాల బకాయిలను దశల వారీగా చెల్లించే ప్రణాళికను కూడా వెల్లడించాలి. యాజమాన్యం సమాధానం మాకు సంతృప్తిని ఇవ్వకపోతే, కంపెనీల చట్టంలోని 433 సెక్షన్ క్రింద న్యాయస్దానంలో కంపెనీని మాసియాలంటూ పిటీషన్ దాఖలు చేస్తాం అంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications