విప్రో నికర లాభం రూ. 1,716 కోట్లు, 50 కొత్త క్లయింట్లు

దేశం మొత్తం మీద ఆర్థిక వృద్ధిపై అంచనాలు ఓ మోస్తరుగానే ఉంటున్నప్పటికీ.. అంతర్జాతీయంగా కూడా పలు కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి, ఆదాయాలలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ తెలిపారు. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 1.585 -1.625 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వినియోగదారులకు సేవలు అందించేందుకు వ్యూహాత్మక రీతిలో పెట్టుబడులు పెట్టడమే కాక సంస్థాపరంగా, సాంకేతికపరంగా వృద్ధి చేస్తూనే ఉంటామని విప్రో ఐటి బిజినెస్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, సిఇవో టికె కురియన్ చెప్పారు.
డిసెంబర్ నాటికి ఐటి సేవల విభాగంలో కంపెనీ 1,42,905 మంది ఉద్యోగులుండగా ఈ త్రైమాసికంలో 2,336 మంది కొత్తగా చేరారని అన్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే నిర్వహణ మార్జిన్లు మెరుగుపడ్డాయని విప్రో ఈడీ సురేష్ సేనాపతి చెప్పారు. విభాగాల వారీగా చూస్తే ఐటీ ప్రోడక్టుల ఆదాయం 11% పెరిగి రూ. 997 కోట్లకు చేరగా, కన్జూమర్ కేర్, లైటింగ్ వ్యాపార విభాగం ఆదాయం 17% పెరిగి రూ. 1,028 కోట్లకు చేరింది. దీంతో ప్రముఖ ఐటి కంపెనీ విప్రో ప్రతి షేర్‌పై రూ.2 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications