ఇన్పోసిస్ @ Q3: 12 శాతం పెరిగిన ఇన్పోసిస్ ఆదాయం

Infosys
Infosys: Quotes, News
BSE 1068.05BSE Quote18 (-1.69%)
NSE 1068.00NSE Quote17.2 (-1.61%)
ముంబై: భారతదేశపు రెండవ అతి పెద్ద ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసిక ఆర్దిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్పోసిస్ టెక్నాలజీస్ సంస్ద నికరలాభం స్వల్పంగా త్గగినప్పటికీ.. అనలిస్టుల అంచనాలకు తగ్గట్టుగానే ఆర్దిక ఫలితాలను ప్రకటించింది.

ఈ త్రైమాసికంలో ఇన్పోసిస్ టెక్నాలజీస్ సంస్ద రూ. 2,369 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతయేడాది ఇదే సమయంలో నికరలాభం రూ. 2,372 కోట్లుగా నమోదైంది. దీంతో ఈ త్రైమాసికంలో ఇన్పోసిస్ టెక్నాలజీస్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 10,424 కోట్లకు చేరింది. దీంతో ఇన్పోసిస్ ఫలితాలు స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి.

శుక్రవారం రోజున స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 104 పైగా లాభపడుతూ 19,767 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ 18 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతూ 5,987కి సమీపంలో ట్రేడవుతోంది.

ఇక ఇటీవల ఇన్పోసిస్ 'పనితీరు' బాగాలేని వారికి భారీ స్దాయిలో ఉద్వాసన పలకనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుమారుగా 5,000 వరకు ఉండొచ్చునని తెలుస్తుంది. భారీసంఖ్యలో ఇన్పోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందని, 5,000 మందికి ఉద్వాసన పలకవచ్చునని వస్తున్న వార్తల నేపధ్యంలో ఇన్పోసిస్ ఒక ప్రకటన చేసింది. పనితీరు అస్సలు బాగాలేని కొందరు ఉద్యోగులను వేరే ఉద్యోగాలు వెతుక్కోమని మాత్రమే చెప్పామని పేర్కొంది. పనితీరు బాగాలేని వారు పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది.

మరీ అస్సలు పనితీరు లేని వారిని ఇతర ఉద్యోగాలు వెతుక్కోవాలని ప్రోత్సహిస్తామని కంపెనీ వెల్లడించింది. వైదొలగమని తాము సూచించబోయే ఉద్యోగుల సంఖ్య 5,000 కన్నా చాలా తక్కువే ఉంటుందని పేర్కొంది. దాదాపు 1,50,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్న తమ స్థాయి కంపెనీల్లో ఇలాంటి పరిణామాలు సాధారణమేనని తెలిపింది. ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమేనని, తొలిసారిగా ఇప్పుడు చేయడం లేదని ఇన్సోసిస్ తన ప్రకటనలో పేర్కొంది.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+