కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు పునరుద్ధరణకు దరఖాస్తు: విజయ్ మాల్యా లేఖ

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఫ్లయింగ్ లైసెన్స్ గడువు ఇటీవల ముగిసినప్పటికీ.. రెండేళ్లలోగా ఈ లైసెన్స్‌ను పునరుద్దరించుకునే అవకాశం ఉంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2003, ఆగస్టు 26న ఎయిర్ డెక్కన్ కంపెనీ నుండి లైసెన్స్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌డెక్కన్‌ను ఆ తర్వాత యూబీ గ్రూప్ కొనుగోలు చేసి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌ఫిషర్ ఉద్యోగులు సమ్మెకు దిగడం, కంపెనీ లాకౌట్ ప్రకటించడం, తదితర పరిణామాలనంతరం 2012 అక్టోబర్ 20న ఆ కంపెనీ ఫ్లయింగ్ లెసైన్స్‌ను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఈవో పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు సమర్పించారు. కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు సమకూర్చుకునే విషయమై మరింత స్పష్టత కావాలంటూ డీజీసీఏ కింగ్‌ఫిషర్‌ను కోరింది. కంపెనీకి రూ. 7,000 కోట్ల మేర రుణభారం, రూ. 8,000 కోట్ల నష్టాలు ఉన్నాయి.
ఉద్యోగులు మాత్రం ఎనిమిది నెలల్లో తమ వేతన బకాయిలను చెల్లించే భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు రాకపోతే కింగ్‌ఫిషర్‌ను మూసివేయాలని కోరుతూ న్యాయస్దానాన్ని ఆశ్రయించాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. తమ భవిష్యత్ కార్యచరణను వివరించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని కలవడంతో పాటు.. అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్నారు.
కింగ్‌ఫిషర్ పునరుద్దరణ ప్రణాళికను వివరాలతో మాతో పంచుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాం. జీతాల బకాయిలను దశల వారీగా చెల్లించే ప్రణాళికను కూడా వెల్లడించాలి. యాజమాన్యం సమాధానం మాకు సంతృప్తిని ఇవ్వకపోతే, కంపెనీల చట్టంలోని 433 సెక్షన్ క్రింద న్యాయస్దానంలో కంపెనీని మాసియాలంటూ పిటీషన్ దాఖలు చేస్తాం అంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications