కింగ్‌ఫిషర్ యిర్‌లైన్స్‌ని మూసివేయాలని కోరుతూ కోర్టుకెళ్లనున్న ఉద్యోగులు

కింగ్‌ఫిషర్ పునరుద్దరణ ప్రణాళికను వివరాలతో మాతో పంచుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాం. జీతాల బకాయిలను దశల వారీగా చెల్లించే ప్రణాళికను కూడా వెల్లడించాలి. యాజమాన్యం సమాధానం మాకు సంతృప్తిని ఇవ్వకపోతే, కంపెనీల చట్టంలోని 433 సెక్షన్ క్రింద న్యాయస్దానంలో కంపెనీని మాసియాలంటూ పిటీషన్ దాఖలు చేస్తాం అంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఫ్లయింగ్ లైసెన్స్ గడువు ఇటీవల ముగిసినప్పటికీ.. రెండేళ్లలోగా ఈ లైసెన్స్‌ను పునరుద్దరించుకునే అవకాశం ఉంది. లైసెన్స్ గడువు ముగియడంతో, తిరిగి లైసెన్స్ పునరుద్దరించడానికి ఎక్కువ సమయం పడుతుందని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు మరింత లేట్ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ మాత్రం గడువు ముగిసిన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కోంది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2003, ఆగస్టు 26న ఎయిర్ డెక్కన్ కంపెనీ నుండి లైసెన్స్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌డెక్కన్‌ను ఆ తర్వాత యూబీ గ్రూప్ కొనుగోలు చేసి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌ఫిషర్ ఉద్యోగులు సమ్మెకు దిగడం, కంపెనీ లాకౌట్ ప్రకటించడం, తదితర పరిణామాలనంతరం 2012 అక్టోబర్ 20న ఆ కంపెనీ ఫ్లయింగ్ లెసైన్స్‌ను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఈవో పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు సమర్పించారు. కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు సమకూర్చుకునే విషయమై మరింత స్పష్టత కావాలంటూ డీజీసీఏ కింగ్‌ఫిషర్‌ను కోరింది.
కింగ్‌ఫిషర్ లెసైన్స్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నామని డీజీసీఏ వర్గాలు తాజాగా వెల్లడించాయి. గత వారమే తాము లెసైన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేశామని, విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించడానికి సంబంధించిన పునరుద్ధరణ ప్రణాళికను కూడా సమర్పించామని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. కింగ్‌ఫిషర్ ఫ్లయింగ్ లెసైన్సు గడువు ఇప్పటికే ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీకి రూ. 7,000 కోట్ల మేర రుణభారం, రూ. 8,000 కోట్ల నష్టాలు ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications